అప్పుడే పుట్టిన ఓ శిశువు చనిపోగా దాదాపు ఐదురోజులపాటు ఆ శిశువు మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. చిన్నారి మృతదేహం ఆస్పత్రిలో ఉన్న విషయం ఆస్పత్రి సిబ్బంది మర్చిపోవడం గమనార్హం. ఈ సంఘటన ఇండోర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆ హాస్పిటల్ లో ఇండోర్ లోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడం గమనార్హం. శిశువు ఈ నెల 11వ తేదీ చనిపోగా.. 12వ తేదీన మార్చురీలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఆ తర్వాత  ఆ విషయాన్ని మర్చిపోయారు. కాగా.. దాదాపు ఐదు రోజుల తర్వాత మరో వ్యక్తి మృతదేహాన్ని మార్చురీ ఫ్రీజర్ లో పెట్టాలని చూశారు. ఆ సమయంలో.. చిన్నారి శవం ఉన్నట్లు గుర్తించారు. శిశువు మృతదేహం కోసం ఎవరూ రాలేదని దీంతో.. మర్చిపోయినట్లు వైద్య సిబ్బంది చెప్పడం గమనార్హం.. కాగా.. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.