ఇదేం వింత.. మనిషి ముఖంతో జన్మించిన మేక పిల్ల..

దాదాపు మనిషి తలను పోలిన ముఖంతో ఓ మేక పిల్ల జన్మించింది (Goat Born With Human Face). ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Baby goat born with human face..ISR

సాధారణంగా మనిషిని పోలిన జంతువు ఏదంటే టక్కున కోతి అని అందరూ చెప్పేస్తారు. ఎందుకంటే దాని ముఖ కవలికలు, దాని ప్రవర్తన కొంత మానవుడికి దగ్గరగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట మనిషి కూడా ఓ రకం కోతి నుంచే రూపాంతరం చెందాడని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కోతి జాతికి తప్ప మరే జంతు జాతికి మనిషికి దగ్గరి పోలికలు ఉండవు. కానీ మధ్యప్రదేశ్ లో ఓ వింత చోటు చేసుకుంది. 

ఆ రాష్ట్రంలో మనిషి ముఖంను పోలిన ఓ మేకపిల్ల జన్మనిచ్చింది. ఈ విషయం తెలియడంతో దానిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందౌర్ జిల్లా  సిరోంజ్ తహసీల్ లోని సెమాల్ ఖేడి గ్రామానికి చెందిన అన్వర్ కు కొన్ని మేకలు ఉన్నాయి. అయితే వాటిలో మాల్వీ జాతికి చెందిన మేకలు కూడా ఉన్నాయి. అందులో ఒక మేక గత శుక్రవారం ప్రసవించింది. అది కవలలకు జన్మినచ్చింది. 

అయితే అందులో ఓ మేక పిల్ల మాత్రం వికృత తలతో పుట్టింది. దాని తల దాదాపు మనిషిని పోలినట్టుగానే ఉంది. దానికి కళ్లు, నోరు, ముక్కు కూడా ఉన్నాయి. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు మనిషి మాదిరిగానే ఉన్నాయి. దాని తలపై, గడ్డం చుట్టూ మందపాటి తెల్లని బొచ్చు కూడా ఉంది. ఇది గడ్డం లాగా కనిపిస్తుంది. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులు ఆ మేక పిల్లలను చూసేందుకు అన్వర్ ఇంటికి తరలి వస్తున్నారు. చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 

వికృత తలతో జన్మించిన మేకకు సిరంజినీ ఉపయోగించి పాలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జన్యులోపం కారణంగానే మేక పిల్ల ఇలా జన్మించి ఉండవచ్చని స్థానిక పశు వైద్యుడు మానవ్ సింగ్ ‘న్యూస్ 18’తో తెలిపారు. ఈ లోపాన్ని ‘‘హెడ్ డిస్పెప్సియా’’ అని పిలుస్తారని, 50 వేల జంతువుల్లో ఒక దానికి ఈ రుగ్మత వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి లోపం మేకల కంటే పశువులలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. కాగా.. ఈ మేకకు సంబంధించిన వీడియోను ‘న్యూస్ ట్రాక్’ ట్విటర్ లో పోస్ట్ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios