ఒక పిల్లాడు తన తండ్రికి కిచెన్‌ నుంచి దోశ తీసుకొచ్చి వడ్డిస్తున్న వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇందులో విశేషమేమిటంటే ఆ పిల్లాడు.. గరిటెతో తన తండ్రి ప్లేట్‌లో దోశను తిప్పిన విధానం

పిల్లలు ఆటలు ఆడటమే కాకుండా సాధారణ పనులు చేయడాన్ని చూపించే వీడియోలు చాలా ఆనందం కలిగిస్తాయి. మీకు ఇలాంటి వీడియోలు ఇష్టమా. అయితే మా దగ్గర అలాంటి క్లిప్ ఒకటి వుంది. ఒక పిల్లాడు తన తండ్రికి కిచెన్‌ నుంచి దోశ తీసుకొచ్చి వడ్డిస్తున్న వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇందులో విశేషమేమిటంటే ఆ పిల్లాడు.. గరిటెతో తన తండ్రి ప్లేట్‌లో దోశను తిప్పిన విధానం. జోషిక్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కొద్దిసేపట్లోనే ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 16 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఆ పిల్లాడి స్టైల్‌కు, తండ్రిపై ప్రేమకు ఫిదా అవుతున్నారు. 


View post on Instagram