ఆదివారం నాడు చెన్నై-జార్ఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బిడ్డ జన్మించింది. పురుడు కోసం వెడుతున్న తల్లికి పురిటినొప్పులు ఎక్కువవడంతో రైలులోని బాత్రూంలోనే ప్రసవించింది. 

కాకినాడ : chennai-jharkhand expressలో ఆదివారం ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. Railway officials తెలిపిన వివరాల ప్రకారం, వర్ష కుమారి (21), ఆమె భర్త శంకర్ క్రిక్తా చెన్నైలో రైలు ఎక్కారు. ఆమె Childbirth కోసం వారు జార్ఖండ్‌కు వెల్తున్నారు. కాగా, రైలు సామర్లకోట స్టేషన్‌కు సమీపిస్తుండగా ఆ మహిళకు Hemorrhoids మొదలయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని భర్త.. ఆమెను కోచ్‌లోని బాత్రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నొప్పులు ఎక్కువ కావడంతో కదులుతున్న రైలులోనే బిడ్డకు జన్మనిచ్చింది.

మహిళకు నొప్పులు రావడం.. భర్త కంగారు.. చివరికి ప్రసవం.. విషయం తెలుసుకున్న ఇతర ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు రైలు సామర్లకోటకు వచ్చేసరికి స్టేషన్‌లో 108 అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. రైలు ఆగగానే తల్లీబిడ్డలను బాత్రూంలోనుంచి తీసుకువచ్చి.. వెంటనే సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి మరింత మెరుగైన చికిత్స అందజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. తమకు సహకరించిన రైల్వే అధికారులకు, సహ ప్రయాణికులకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే నిరుడు అక్టోబర్ లో ఎయిరిండియా విమానంలో చోటు చేసుకుంది. ఆకాశంలో అద్భుతం జరిగింది. ఓ బుడతడు ఎగురుతున్న విమానంలో ఎంచక్కా తల్లిగర్భంలోంచి ‘గాల్లో పడ్డాడు’. నెలలు నిండక ముందే ఆ బుడతడికి తొందర ఎక్కువయ్యింది. అందుకే విమానంలో ఇండియాకు వస్తుంటే మార్గ మద్యలోనే మారాం చేశాడు. తల్లితో పాటు.. తోటి ప్రయాణికులు కూడా ఆ బుడతడి తొందరను అర్థం చేసుకున్నారు. కాసేపు టెన్షన్ పడ్డా.. చివరికి విమానంలోని డాక్టర్లు, నర్సులు ఆ బుడతడిని బాహ్యప్రపంచంలోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెడితే... 

లండన్ నుంచి కోచి బయలు దేరిన Air India Flight ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు Labor pains మొదలుకావడమే ఇందుకు కారణం. విమానంలో 204మంది ప్రయాణిస్తున్నారు. ముందుగా ఈ విషయం గమనించిన తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. విషయాన్ని వెంటనే విమానంలోని స్టాఫ్ కి వివరించారు. 

వారు ప్రయాణికుల్లో గమనించగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారని తేలింది. వారి టెన్షన్ రిలీవ్ అయ్యింది. ఈ doctors వెంటనే ఆ మహిళకు వైద్యం మొదలుపెట్టారు. నెలలు నిండని ప్రసవం కావడంతో.. కొంచెం రిస్క్ చేశారు. చివరికి delivery సుఖాంతమై.. క్యార్ క్యార్ అనే బాబు కేకలతో ‘హమ్మయ్య’ అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఆమెకు వైద్యం పర్యవేక్షణ అవసరం కావడంతో మార్గమద్యలో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో అత్యవసరంగా విమానాన్ని దించి, తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. మరో ప్యాసింజర్ వీరికి తోడుగా ఉన్నారు. మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి కోచికి బయలుదేరింది. మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఆ ముగ్గురినీ తర్వాత ఫ్రాంక్ ఫర్ట్ నుంచి భారత్ కు తీసుకువస్తామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.