Asianet News TeluguAsianet News Telugu

బాబ్రీ మసీదు కూల్చివేత: సీబీఐ జడ్జి ఎస్ కే యాదవ్ రిటైర్మెంట్ ఏడాది పొడిగింపు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక జడ్జి ఎస్ కే యాదవ్  రిటైర్మెంట్ ను ఏడాది పాటు  పొడిగించింది. 

Babri masjid demolition case: Set to retire in 2019, special judge SK Yadav got extension lns
Author
New Delhi, First Published Sep 30, 2020, 4:21 PM IST

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక జడ్జి ఎస్ కే యాదవ్  రిటైర్మెంట్ ను ఏడాది పాటు  పొడిగించింది. 

1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. 28 ఏళ్ల తర్వాత ఈ కేసుపై తీర్పును వెలువరించింది కోర్టు. ఈ కేసును  విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు 2005 నుండి ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ కె యాదవ్ విచారిస్తున్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసును రెండేళ్లలో తీర్పు చెప్పాలని 2017లో సుప్రీంకోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ కే యాదవ్ ను కోరింది.అయితే ఈ కేసు విచారణను కొనసాగించి తుది తీర్పును ఇవాళ ఇచ్చాడు. తీర్పు ఇచ్చే సమయంలో నిందితులను కోర్టుకు హాజరుపర్చాలని ప్రత్యేక జడ్జి కోరాడు.

2019లోనే ఎస్ కే యాదవ్ రిటైర్మెంట్ కావాల్సి ఉంది.  ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనందున యాదవ్ కు మరో ఏడాది గడువును పొడిగించింది సుప్రీంకోర్టు.ఈ తీర్పును వెలువరించేందుకు తనకు ఇంకా సమయం కావాల్సి ఉందని యాదవ్ సుప్రీంకోర్టును కోరడంతో ఏడాది పాటు ఆయన టర్మ్ ను సుప్రీంకోర్టు పొడిగించింది. 

also read:బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు: హైకోర్టులో సవాల్ చేయనున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

ఇవాళ కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత యాదవ్ రిటైర్ కానున్నారు.ఈ తీర్పు నేపథ్యంలో యాదవ్ కు భద్రతను పెంచారు. ఈ కేసులో 351 మంది సాక్షులను సీబీఐ కోర్టు కు సీబీఐ సమర్పించింది.అంతేకాదు 600 డాక్యుమెంట్లను కూడ కోర్టు ముందుంచింది.

ఈ ఏడాది జూలై 24వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఎల్ కే అద్వానీ హాజరై స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ కేసులో  మురళీ మనోహార్ జోషీ, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్ లపై ఈ కేసులో ఆరోపణలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios