తెరచుకున్న బాబ్లీ గేట్లు.. తెలంగాణ వైపు పరిగెడుతున్న గోదారమ్మ

First Published 1, Jul 2018, 5:04 PM IST
babli project gates opened
Highlights

తెరచుకున్న బాబ్లీ గేట్లు.. తెలంగాణ వైపు పరిగెడుతున్న గోదారమ్మ

బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తెరిచింది. సుప్రీం ఆదేశాల మేరకు ప్రతి ఏటా జూన్ 30వ తేదీ అర్థరాత్రి దాటాక బాబ్లీ గేట్లు ఎత్తి.. నీటిని కిందకు వదలాలి.. ఈ ఆదేశాల మేరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. బాబ్లీ ప్రాజెక్ట్, కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో ఈ ఉదయం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని.. రెండు గేట్లు ఎత్తారు. సాయంత్రానికల్లా 14 గేట్లను ఎత్తనున్నారు.. ప్రస్తుతం జలాశయంలో 0.56 టీఎంసీల నీరుంది. రేపటికి నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు చేరనుంది. అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరిచే ఉంటాయి.. ఈ నేపథ్యంలో గోదావరి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని.. బాసర వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 


 

loader