Asianet News TeluguAsianet News Telugu

బాలికపై చిన్నాన్న అత్యాచారం.. చంపేస్తానని బెదిరింపు.. ఆశావర్కర్ చూడడంతో...

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నాన్న, చిన్నమ్మల వద్ద ఆశ్రయం పొందుతున్న ఓ చిన్నారిపై బాబాయ్ కన్నేశాడు. ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

babai molested minor girl in bangalore
Author
First Published Sep 16, 2022, 9:53 AM IST

బెంగళూరు : మైనర్ బాలిక(17)పై చిన్నాన్న అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో చోటు చేసుకుంది.  9వ తరగతి వరకు చదివి బాలిక బడి మానేసింది. మూడేళ్ల నుంచి చిన్నాన్న, చిన్నమ్మల వద్ద ఉంటుంది. ఇటీవల ఆశ కార్యకర్త గ్రామానికి వచ్చినప్పుడు బాలిక కడుపుతో ఉన్న విషయం చూసింది. విచారించగా చిన్నాన్న లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఫిబ్రవరి నెలలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని బాలిక పోలీసుల విచారణలో తెలిపింది. కామాంధుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో దారుణమైన సంఘటన జరిగింది. మైనర్ బాలికను కిడ్పాప్ చేసిన యువకులు ఓ లాడ్జీలో సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు బాలికను లాడ్జీకి తీసుకుని వెళ్లి మత్తుమందు ఇచ్చారు. 

డెలివరీ బాయ్ సాహసం... ఫుడ్ డెలివర్ చేయడానికి ఏం చేశాడంటే...!

ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెను లాడ్జీలోనే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నవజాత శిశువు మృతదేహం ఉందనే సమాచారంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే పోలీసులకు పాఠశాలలో చదువుకునే విద్యార్థిని చేసిన పనే అని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

తమిళనాడులోని కడలూరు జిల్లా, చిదంబరం టౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద స్థానికులు నవజాత శిశువు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు  ప్రారంభించారు. వారి దర్యాప్తులో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న16 ఏళ్ల విద్యార్థిని ఈ శిశువుకు జన్మనిచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. 

దీంతో వెంటనే ఆ అమ్మాయిని విచారించారు. సదరు విద్యార్థిని నిజం ఒప్పుకుంది. స్కూల్ కు వచ్చిన వెంటనే తీవ్రంగా కడుపునొప్పి రావడంతో బాత్ రూమ్ కి వెళ్లినట్లు తెలిసింది. అక్కడే  చిన్నారిని ప్రసవించానని..  ఆ తరువాత తన దగ్గర ఉన్నపెన్నుతో బొడ్డుతాడు కత్తిరించినట్లు పేర్కొంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను అక్కడే వదిలేసి వచ్చినట్లు అంగీకరించింది. తాను గర్భం దాల్చిన విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలియదని వెల్లడించింది. ప్రెగ్నెన్సీ కారణమైన వారి గురించి పోలీసులు ఆమెను అడగగా.. ఆ వివరాలు ఆమె తెలుపలేదు. దీంతో సదరు విద్యార్థిని ఆస్పత్రికి తరలించిన అధికారులు.. కొంతమంది అనుమానితుల జాబితాను సిద్ధం చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios