పాక్ భూభాగంపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో ఉగ్రవాది అజహర్ యూసుఫ్ హతమయ్యాడు.

పాక్ భూభాగంపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో ఉగ్రవాది అజహర్ యూసుఫ్ హతమయ్యాడు. అసలు ఎవరీ అజహర్ యూసుఫ్..? ఇతన్ని భారత ఆర్మీ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది..?

ఇటీవల పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే.. భారత్ నేడు సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడింది. అయితే.. మొన్న జరిగిన పుల్వామా ఉగ్రదాడి సూత్రదారి జైషే మొహమ్మాద్ అధినేత మౌలానా మసూద్ అజహర్ బావమరిదే ఈ అజహర్ యూసుఫ్. భారత్ మోస్ట్ వాంటెడ్, ఇంటర్ పోల్ జాబితాలో అజహర్ యూసుఫ్ పేరు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విజయ్ గోఖలే ప్రకటించారు.

1999లో ఐసీ-814 విమానం హైజాక్‌లోను అజహర్ కీలకపాత్ర పోషించారు. విమానం హైజాక్ చేసిన సమయంలో ప్రయాణికులను కాపాడుకునేందుకు మసూద్ అజహర్‌ను భారత్ విడుదల చేసింది. 2002లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాను 20 మంది పేర్లతో భారత్.. ఇస్లామాబాద్‌కు పంపించిది. ఈ జాబితాలో యూసఫ్ అజర్ కూడా ఉన్నారు. పాకిస్థాన్ కరాచీలో జన్మించిన యూసఫ్ అజర్ ఉర్దూ, హిందీలో అనర్గళంగా మాట్లాడుతాడు.