Azadi Ka Amrit Mahotsav tour: కర్ణాటకలో తాజా మ‌రో వివాదం తెర మీద‌కి వ‌చ్చింది. అదే హిందీ వివాదం కలకలం రేగింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉత్తరాఖండ్‌ టూర్‌కు వెళ్లేందుకు హిందీ మాట్లాడగలిగే విద్యార్థులనే ఎంపిక చేయాలని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(బెంగళూరు సౌత్‌) డిప్యూటీ డైరెక్టర్‌ ఇచ్చిన సర్క్యులర్‌ వివాదాస్పదంగా మారాయి. 

Azadi Ka Amrit Mahotsav tour: బీజేపీ పాలిత క‌ర్ణాట‌క‌లో త‌రుచు ఏదోక వివాదం చేలారేగుతూనే ఉంటుంది. మ‌త ప్ర‌తిపాదిక‌నో.. లేదా భాష ప్ర‌తిపాదిక‌నో వివాదాలు తెర‌మీదికి వ‌స్తునే ఉంటాయి. తాజాగా హిందీ వివాదం క‌ల‌కలం రేపింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్ కార్య‌క్ర‌మంలో భాగంగా కొంత మంది విద్యార్థుల‌తో ఉత్తరాఖండ్ టూర్ నిర్వ‌హించ‌బోతున్నారు. అయితే ఈ టూర్కు హిందీ మాట్లాడగ‌లిగే విద్యార్థుల‌ను ఎంపిక చేయాల‌ని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(బెంగళూరు సౌత్‌) డిప్యూటీ డైరెక్టర్ జారీ చేసి సర్క్యులర్‌ వివాదాస్పదంగా మారింది. 

ఈ విషయంలో రాష్ట్రప్ర‌భుత్వం లేదా కేంద్రప్ర‌భుత్వంతో ఎటువంటి సంబంధం లేద‌ని అధికారులు తెలిపారు. వైరల్‌గా మారిన సర్క్యులర్‌లో.. "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన‌ విద్యార్థుల‌తో ఉత్తరాఖండ్ టూర్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా.. ప్ర‌తి క‌ళాశాల నుంచి ఇద్ద‌రూ విద్యార్థుల‌ను ఎంపిక చేస్తారు. వీరిని ప్రీ-యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్‌లోని బెంగుళూరు సౌత్ జిల్లా నుండి ఎంపిక చేస్తుంది. అయితే.. హిందీ మాట్లాడగలవారు, సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక, క్రీడా కార్యకలాపాలపై ఆసక్తి ఉన్నవారిని సెల‌క్ట్ చేసి.. ఆ విద్యార్థుల జాబితాను డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి పంపించాల‌ని సర్క్యులర్‌లో కళాశాలలను ఆదేశించింది. విద్యార్థుల తుది ఎంపికను డిప్యూటీ డైరెక్టర్ చేస్తారు.

ఈ క్ర‌మంలో హిందీ మాట్లాడ‌గ‌లిగే వారు అని సెల‌క్ట్ చేయాలని ఆదేశించ‌డం పై తీవ్ర దూమారం రేగింది.
ఈ సర్క్యులర్‌పై కన్నడ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ టీఎస్‌ నాగభరణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాశారు. అయితే, కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ అటువంటి సూచనలు చేయలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ బుధవారం పేర్కొన్నారు.

ఈ వివాదానికి కార‌ణ‌మైన అధికారులు లేదా ఉద్యోగులపై శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ టూర్ ప్రోగ్రాం కింద 50 మంది విద్యార్థులతో కూడిన బ్యాచ్‌ను ఉత్తరాఖండ్‌కు పంపుతామని తెలిపారు. ఈ వివాదంపై కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ (కెడిఎ) ఛైర్మన్ టిఎస్ నాగభరన్ ఎంపిక ప్రమాణాలను మార్చాలని, కన్నడ మాట్లాడే విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరుతూ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాశారు.