ఆరేళ్లుగా మరదలిపై బావ అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన తమిళనాడు  రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడ్ సమీపంలోని ఓ గ్రామంలో అయ్యప్పన్ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఆయన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 

అయ్యప్పన్ భార్య పదవతరగతి చదువుతోంది. అయ్యప్పన్ ఇంట్లోనే ఆ యువతి కూడ నివాసం ఉండేది. అయితే ఆరేళ్లుగా ఆ యువతిపై అయ్యప్పన్ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

అయితే  ఇటీవల ఆ యువతి గర్భం దాల్చింది.  ఈ విషయం తెలిసిన అయ్యప్పన్ ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లి  అబార్షన్ చేయాలని వైద్యులను కోరారు. ప్రియుడి కారణంగా ఆ యువతి గర్భం దాల్చిందని  వైద్యులకు చెప్పాడు.  అయ్యప్పన్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు అయ్యప్పన్‌ను విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.