Asianet News TeluguAsianet News Telugu

coronavirus: చిన్నారులకు ఆయుర్వేద బాలరక్ష..!

ఇంతరవకు పిల్లలకు కోవిడ్ టీకా రాని నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్ ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

Ayush Ministry to launch immunity boosting kit for children
Author
Hyderabad, First Published Oct 1, 2021, 9:35 AM IST

కరోనా మహమ్మారి మనదేశాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. కరోనా థర్డ్ ఫేజ్ కూడా పొంచి ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ పిల్లల కోసం ఓ కిట్ ను రూపొందించింది. 16ఏళ్ల లోపు వయసున్నవారికి ఉద్దేశించి .. రోగ నిరోధక శక్తిని పెంచే బాల్ రక్షా కిట్ ను అభివృద్ధి చెందింది.

 కేంద్ర ఆయుష్ శాఖ పరిధిలో  భారత ఆయుర్వేద సంస్థ( ఏఐఐఏ) పనిచేస్తోంది. ఈ కిట్ కోవిడ్ కారక కరోనా వైరస్ పై  పోరాడేందుకు, పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయుష్ శాఖ అధికారులు తెలిపారు. ఇంతరవకు పిల్లలకు కోవిడ్ టీకా రాని నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్ ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

కిట్ లో భాగంగా తులసి, తిప్పతీగ, దాల్చిన చెక్క, లికోరైస్ , ఎండు ద్రాక్షలతో తయారు చేసిన సరిప్ తో పాటు అన్ను ఆయిల్, సీతోపలాది, చ్యవన్ ప్రాశ్ లు ఉంటాయని వెల్లడించారు. ఈ సిరప్ లో అద్భుత ఔషధ గుణాలుఉన్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కిట్ ను రూపొందించారని.. దీన్ని ప్రభుత్వ  రంగ సంస్థ ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాసు్యుటిక్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపీసీఎల్) తయారు చేసినట్లు చెప్పారు. నవంబర్ 2న జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఏఐఐఏ 10వేల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios