Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామ మందిరం : లతా మంగేష్కర్ AI- వాయిస్ లో.. 'రామ్ ఆయేంగే' పాట.. ఉర్రూతలూగుతున్న నెటిజన్లు.. (వీడియో)

ఎనిమిది దశాబ్దాలు సంగీతప్రపంచానికి విశేష సేవలు అందించారు దివంగత గాయని లతా మంగేష్కర్. ఆమెసేవలకు గుర్తింపుగా అయోధ్యలో ఓ చౌక్ కు లతామంగేష్కర్ చౌక్ గా నామకరణం చేశారు. 

Ayodhya Ram Mandir: Lata Mangeshkar in AI-Voice.. 'Ram Ayenge' song.. Netizens are excited - bsb
Author
First Published Jan 22, 2024, 8:47 AM IST

అయోధ్య : నెట్టింట్లో ఇప్పుడు స్వయంగా లతా మంగేష్కర్ పాడిన రాముడి పాట వైరల్ అవుతోంది. రామ్ ఆయేంగే అనే శ్లోకం పాడుతున్న ఇండియన్ నైటింగేల్ కృత్రిమ మేధస్సు రూపొందించిన స్వరం ఆన్‌లైన్‌లో కనిపించినప్పుడు, నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.
 
దివంగత గాయని లతా మంగేష్కర్ భారతీయ సంగీత పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపారు, ఆమె అభిమానుల హృదయాలలో శూన్యతను మిగిల్చింది. ఇప్పుడు కూడా, సంగీత అభిమానులు ఆమె మధురమైన గాత్రాన్ని వినాలని కోరుకుంటారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ చారిత్రక సందర్భంలో లతా మంగేష్కర్ ఉంటే ఎలా ఉండేది.. అనే ఆలోచన వచ్చిందొకరికి.. ఇంకేం.. అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి ఆమె గాత్రాన్ని, లిప్ సింక్ చేసినట్టు చేసి.. నెట్టింట్లో పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

లతా మంగేష్కర్ లెజెండరీ సింగర్, ఆమె స్వరం ఓ అద్భుతం, సున్నితమైన వ్యక్తిత్వానికి గుర్తింపు. ఆమె మరణించిన రెండేళ్ల తర్వాత కూడా దేశం ఆమెను గుర్తుంచుకుంటుంది. ఆమె గొంతులో రాముడి పాటను వినాలని కోరుకుంటుంది. ఇటీవల, ఒ వ్యక్తి X (గతంలో ట్విట్టర్) లో ఒక ఆడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. అందులో రామ్ ఆయేంగే.. అంటూ పాడుతున్న వాయిస్ లతా మంగేష్కర్‌గా పిచ్ చేసారు. వినియోగదారులు ఇది AI సాంకేతికతలతో తయారు చేయబడిందని గ్రహించారు. 

మరికొద్ది గంటల్లో అయోధ్యలో అద్భుతఘట్టం ... సుందరంగా ముస్తాబైన రామమందిరం

ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ఇప్పటి వరకు AIని ఉపయోగించిన అత్యంత సరైన విధానం" అని రణ్ విజయ్ సింగ్ అనే ఆ నెటిజన్  కామెంట్ చేశారు. ఈ పాట విన్న తర్వాత, అనేక మంది సంగీతాభిమానులు, లతా జీ అభిమానులు వారి భావాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు. ఒకరేమో.. “ఇది వింటుంటే నాకళ్లు అప్రమత్తంగా కన్నీళ్లు కార్చాయి. అంటూ .. లతా జీ (రెడ్ హార్ట్ ఎమోజీలు)కి ప్రేమతో" అంటే..  మరొకరు  "ఈ పాటను లతాజీ వాయిస్‌లో విన్న తర్వాత నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.. మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇది షేర్ చేసినందుకు ధన్యవాదాలు, దీన్ని తయారు చేసిన వ్యక్తికి ధన్యవాదాలు . లతా జీ ఆప్కీ ఆవాజ్ హమేషా అమర్ రహేగీ” అంటూ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక మరొకరు.."భారతదేశపు నైటింగేల్ ది గ్రేట్ లతా మంగేష్కర్జీ, నిజంగా అమరత్వం పొందారు" అని కామెంట్ చేశాడు. ఇక మరికొందరు.."అద్భుతం!!! పాట నాకు గూస్‌బంప్స్ తెప్పించింది. జై సియా రామ్" అని అనేకమంది కామెంట్ చేశారు.లతా మంగేష్కర్ ఎవర్ గ్రీన్ సింగర్, నేపథ్య గాయనిగా వేల పాటలు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆమె ఎనిమిది దశాబ్దాల కెరీర్‌లో సంగీత పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. క్వీన్ ఆఫ్ మెలోడీగా పేరుగాంచారు. కొన్ని విదేశీ భాషలతో పాటు ముప్పై ఆరు భారతీయ భాషల్లో పాటలు పాడారు. ఆమె ఎవర్‌గ్రీన్ పాటల్లో కొన్ని లాగ్ జా గలే, తేరే బినా జిందగీ సే, ఓ మేరే దిల్ కే చైన్, యే దిల్ తుమ్ బిన్ కహిన్ లగ్తా నహిన్, వీర్-జారా ఆల్బమ్‌లోని తేరే లియే లాంటివి మరెన్నో ఉన్నాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios