అయోధ్య: అయోధ్య రామ మందిరానికి నేడు బుధవారం భూమి పూజ జరిగింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి నేడు ఉదయం 12.45 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ స్మరణతో మారుమోగుతోంది.

తొమ్మిది ఇటుకలను అక్కడ పెట్టారు. అవి 1989లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పంపినవి. దాదాపు 2 లక్ష 27 వేల ఇటుకలను భక్తులు పంపించారు. జై శ్రీరామ్ అని ఉన్న 100 ఇంటకులను మాత్రం తీసుకున్నారు.

హనుమాన్ గడీలో, రామ్ లల్లాలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు.

హనుమాన్ గడీ ఆలయంలో  ప్రధానార్చకుడు  శ్రీ గద్దిశీన్ ప్రేమ్ దాస్ మహరాజ్ మోడీకి శిరస్త్రాణం, వెండి ముకుఠం, ఉత్తరీయం ప్రదానం చేశారు. ప్రధాని పారిజాతం మొక్కను నాటారు.

ఆయన వెంట సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు. కాసేపట్లో రామాలయ భూమి పూజ జరిగే స్థలానికి చేరుకుంటారు.

ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్ గడీ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. 

ప్రధాని మోడీ లక్నో నుంచి అయోధ్యకు చేరుకున్నారు. మోడీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, అధికారులు స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికే విషయంలో కరోనా మార్గదర్శకాలను పాటించారు.

ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి లక్నో చేరుకుని ఆ తర్వాత అయోధ్యకు బయలుదేరారు.  

భూమి పూజలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరారు.  స్పెషల్ జెట్ లో ఢిల్లీ నుంచి బయలుదేరిన మోడీ లక్నోలో దిగుతారు. ఆ తర్వాత హెలికాప్టర్ లో అయోధ్య బయలుదేరి వస్తారు. అయోధ్యలో ఆయన తొలుత హనుమాన్ గఢి ఆలయంలో పూజలు చేస్తారు.మోడీ పట్టుపంచె, పొడగు కుర్తా ధరించిన మోదీ మెడలో పట్టువస్త్రాన్ని వేసుకున్నారు.

 

 

మోడీతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృత్ గోపాల్ దాస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యుపి గవర్నర్ అనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ హాజరవుతారు. 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమా భారతి దూరంగా ఉంటున్నారు.

ప్రజలు భూమి పూజ సంబరాలను ప్రత్యక్షంగా చూడడానికి పవిత్రమైన అయోధ్య నగరంలో భారీ సీసీటీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.