Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య: అవసరమైతే ఈనెల 25వ తేదీ నుండి రోజు వారీ విచారణ

అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీమసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఈ నెల 18వ తేదీ లోపుగా నివేదికను సమర్పించాలని  సుప్రీంకోర్టు  గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
 

Ayodhya Hearing From July 25 If Mediation Panel Rules Out Role: Top Court
Author
New Delhi, First Published Jul 11, 2019, 12:47 PM IST

న్యూఢిల్లీ:  అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీమసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఈ నెల 18వ తేదీ లోపుగా నివేదికను సమర్పించాలని  సుప్రీంకోర్టు  గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

అయోధ్య కేసులో  ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం కన్పించడం లేదని  దాఖలైన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు గురువారం నాడు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపకపోతే ఈ నెల 25వ తేదీ నుండి రోజు వారీ విచారణ చేపట్టనున్నట్టు  సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను  పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో మధ్యవర్తుల కమిటిని ఈ ఏడాది మార్చి8వ తేదీన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

ఇటీవలనే ఈ కమిటీ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. మరోవైపు తమకు మరింత గడువును ఇవ్వాలని ఈ కమిటీ సుప్రీంకోర్టును కోరింది. ఆగష్టు 15వ తేదీ వరకు న్యాయస్థానం గడువును ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios