Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో రామజన్మ భూమి పరిసరాల్లో పూజరి దారుణ హత్య.. వారిపైనే అనుమానం..!!

అయోధ్యలోని రామజన్మ భూమి పరిసరాల్లో దారుణం చోటుచేసుకుంది. హనుమాన్‌గర్హి ఆలయంలో పూజరి దారుణంగా చేయబడ్డాడు. 

Ayodhya Hanumangarhi Temple priest found dead in High Security Zone Ksm
Author
First Published Oct 19, 2023, 4:00 PM IST

అయోధ్యలోని రామజన్మ భూమి పరిసరాల్లో దారుణం చోటుచేసుకుంది. హనుమాన్‌గర్హి ఆలయంలో పూజరి దారుణంగా చేయబడ్డాడు. పూజరి ఒక గదిలో గొంతు కోసి చంపేశారు. అయితే రామజన్మభూమి ప్రాంగణంలోని హైసెక్యూరిటీ జోన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడిని రామ్ సహరే దాస్‌గా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే ఇది పూజరికి తెలిసిన వ్యక్తే చేసిన పని అని.. నిందితుడు పూజరి గదిలోకి బలవంతంగా ప్రవేశించలేదని పోలీసులు చెప్పారు. 

పోలీసు ఉన్నతాధికారి రాజ్ కరణ్ నయ్యర్ మాట్లాడుతూ.. హనుమాన్‌గర్హి దేవాలయంలోని పూజారులలో రామ్ సహరే దాస్‌ ఒకరని తెలిపారు. ఈరోజు ఉదయం ఆలయంలో పూజల నిర్వహించేందుకు రాలేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆరా తీయగా గదిలో దాస్ మృతదేహం లభ్యమైందని తెలిపారు. ఈ ఘటనపై ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. 

హనుమాన్‌గర్హి ఆలయానికి ప్రక్కనే ఉన్న గదిలో ఇద్దరు శిష్యులతో కలిసి దాస్ ఉండేవారని చెప్పారు. పూజరి శిష్యులు కీలక అనుమానితులుగా ఉన్నారని తెలిపారు. అనుమానితుల్లో ఒకరిని విచారిస్తున్నామని, రెండో వ్యక్తి కనిపించడలం లేదని చెప్పారు. రెండో వ్యక్తి  ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదునైన ఆయుధంతో పూజరి దాస్‌ను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి దాస్ తన శిష్యులతో కొంత ఘర్షణ పడినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios