"కాశ్మీర్, పాకిస్తాన్ లాంటి సున్నితమైన జాతీయ సమస్యలపై" సిద్ధూ ఇద్దరు సలహాదారులు చేసిన "దారుణమైన, అనాలోచితమైన" వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కలత చెందారని తెలుస్తోంది. 

చండీగఢ్ : సున్నితమైన అంశాలపై ప్రకటనలు చేయవద్దని కొత్తగా నియమించబడిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారులను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, "కాశ్మీర్, పాకిస్తాన్ లాంటి సున్నితమైన జాతీయ సమస్యలపై" సిద్ధూ ఇద్దరు సలహాదారులు చేసిన "దారుణమైన, అనాలోచితమైన" వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కలత చెందారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్దూ సలహాదారులకు "పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌కు సలహాలివ్వడమే వారి పని అని, తమకు పూర్తిగా తెలియని విషయాలపై వారుమాట్లాడవద్దని" వారిని కోరారు.

అనాలోచితమైన ప్రకటనలు చేసేముందు ‘ఒక్కసారి.. వాటివల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచించాలి’అని వారిని కోరారు. సిద్దూ సలహాదారు ప్యారే లాల్ గార్గ్ పాకిస్తాన్‌పై విమర్శలు చేశారు. మరో సలహాదారు మల్వీందర్ సింగ్ మాలి కశ్మీర్‌పై చేసిన మరో వివాదాస్పద ప్రకటనతో కెప్టెన్ అమరీందర్ సింగ్ చాలా చిక్కుల్లో పడ్డారు.

పొట్టలో కొకైన్: బెంగుళూరులో ఆఫ్రికన్ దేశస్తుడి అరెస్ట్

ఇటీవల సిద్ధూ నియమించిన ఇద్దరు సలహాదారులు చేసిన వ్యాఖ్యలపై "షాక్"ను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఆ వ్యాఖ్యలు "పాకిస్తాన్-కాశ్మీర్‌పై భారత్, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ కు పూర్తి విరుద్ధమైనవి" అని ముఖ్యమంత్రి అన్నారు.

 "భారతదేశ ప్రయోజనాలకు మరింత నష్టం కలిగించే" ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా సిద్ధూ తన సలహాదారులను నియంత్రించాలని ముఖ్యమంత్రి కోరారు. జమ్మూ కాశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధు టీమ్ ను కెప్టెన్ అమరీందర్ సింగ్ మందలించడం నాలుగు రోజుల్లో ఇది రెండోసారి.

కాశ్మీర్ ఒక ప్రత్యేక దేశం అని, భారతదేశం, పాకిస్తాన్ రెండూ దాని చట్టవిరుద్ధమైన నివాసితులే అని మాలి వివాదం చేశాడు. సిద్ధూ మరొక సలహాదారు, ప్యారే లాల్ గార్గ్ పాకిస్తాన్‌పై కెప్టెన్ సింగ్ విమర్శలను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియామకంపై అమరీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ అతనికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందించారు. గల నెలలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత నెలలో బాధ్యతలు స్వీకరించారు.