Free Tomato: ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఉచితం.. !

Chandigarh: టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. మ‌రికొన్ని రోజులు ధ‌ర‌లు ఇలానే ఉంటాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ట‌మాట ధ‌ర‌ల పెరుగుద‌ల మ‌ధ్య సామాన్యులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న త‌రుణంలో ఒక ఆటో రిక్షా అత‌ను మాత్రం ఉచితంగా ట‌మాటాలు అందిస్తున్నాడు. అయితే దీనికి అత‌ను ఒక ష‌ర‌తు విధించారు. దానిని పూర్తి చేస్తేనే ఉచితంగా ఒక కేజీ ట‌మాట ఇస్తాన‌ని చెబుతున్నాడు. 
 

Auto Rickshaw Driver in Chandigarh Offers Free Tomatoes, but RMA

Free Tomato: మార్కెట్‌లో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. మ‌రికొన్ని రోజులు ధ‌ర‌లు ఇలానే ఉంటాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ట‌మాట ధ‌ర‌ల పెరుగుద‌ల మ‌ధ్య సామాన్యులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న త‌రుణంలో ఒక ఆటో రిక్షా అత‌ను మాత్రం ఉచితంగా ట‌మాటాలు అందిస్తున్నాడు. అయితే దీనికి అత‌ను ఒక ష‌ర‌తు విధించారు. దానిని పూర్తి చేస్తేనే ఉచితంగా ఒక కేజీ ట‌మాట ఇస్తాన‌ని చెబుతున్నాడు. తన ఆటోలో కనీసం ఐదుసార్లు ప్రయాణించిన వారికి మాత్రమే టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

వివ‌రాల్లోకెళ్తే.. పంజాబ్ లోని చండీగఢ్ లో ఆటో రిక్షా డ్రైవర్ ఉచితంగా టమాటాలు అందిస్తున్నాడు. త‌న ఆటోలో ప్ర‌యాణించే వారికి కేజీ ట‌మాటాల‌ను ఉచితంగా అందిస్తాన‌ని చెబుతున్నాడు. దీనికి సంబంధించి త‌న ఆటోకు ఒక ప్ర‌క‌ట‌నను కూడా అతికించాడు. దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనికి ష‌ర‌తుగా ఐదు సార్లు త‌న ఆటోలో వచ్చిన వారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులని తెలిపారు. అరుణ్ చండీగఢ్ లో ఆటో డ్రైవ‌ర్ గ‌త‌  12 సంవత్సరాలుగా ప‌నిచేస్తున్నాడు. గ‌తంలోనూ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాడు. గ‌తంలో అరుణ్ భారత ఆర్మీ సైనికులకు త‌న‌ ఆటోరిక్షాలలో ఉచిత ప్రయాణాన్ని క‌ల్పించాడు. అలాగే,   గర్భిణులకు ఆస్పత్రులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నాడు.

"ఇదే త‌న‌కు ఆదాయ వనరు అనీ, తాను జీవనోపాధి పొందే ఏకైక మార్గమ‌ని అరుణ్ చెప్పాడు. కానీ ఇలాంటి సేవలు అందించడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతున్నాడు. అంతేకాకుండా అక్టోబర్ లో పాకిస్థాన్ తో జరగనున్న క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే చండీగఢ్ లో ఐదు రోజుల పాటు ఉచిత రిక్షా రైడ్స్ అందిస్తాన‌ని"  ప్రకటించారు.

షూలు కొంటే ఉచితంగా ట‌మాటాలు.. 

పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న ఓ షూ స్టోర్ యజమాని ఇటీవల తన వ్యాపారం నుంచి బూట్లు కొనుగోలు చేసిన ఖాతాదారులకు 2 కిలోల టమోటాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించాడు. రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య షూలను కొనుగోలు చేస్తే, ప్రత్యేక విక్రయ ఆఫర్ కింద కస్టమర్లు 2 కిలోల టమోటాలను ఉచితంగా పొందవచ్చ‌ని చెప్పాడు. అలాగే, మధ్యప్రదేశ్ కు చెందిన ఓ దుకాణం యజమాని తన స్టోర్ నుంచి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచితంగా టమోటాలు ఇస్తున్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios