తాగొచ్చాడని కొట్టినందుకు... బిల్డింగ్‌ మీదనుంచి అత్తను తోసేసిన అల్లుడు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 12, Sep 2018, 1:29 PM IST
aunt forced to abandon the building by son in law
Highlights

మద్యం తాగొచ్చాడని అల్లుడిని కొట్టడమే అత్త పాలిట యమపాశమైంది.. మహారాష్ట్రలోని థానేకు చెందిన భట్టీ తన భార్య, ఆమె తల్లితో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి మద్యం అలవాటు ఉంది. 

మద్యం తాగొచ్చాడని అల్లుడిని కొట్టడమే అత్త పాలిట యమపాశమైంది.. మహారాష్ట్రలోని థానేకు చెందిన భట్టీ తన భార్య, ఆమె తల్లితో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి మద్యం అలవాటు ఉంది. దీనిపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఒక రోజు భట్టీ తాగొచ్చాడు... ఎందుకు తాగవంటూ అత్త అతన్ని మందలించింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఉన్న భట్టీ ఆగ్రహంతో ఊగిపోతూ నన్నే కొడతావా అంటూ అత్తను మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేశాడు.

ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు భట్టీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

loader