తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై గుర్తు తెలియని యువకుడు దాడికి పాల్పడ్డాడు. కాంచీపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెల్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై గుర్తు తెలియని యువకుడు దాడికి పాల్పడ్డాడు. కాంచీపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెల్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
అర్థరాత్రి తర్వాత హోటల్ కు వెల్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కమల్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మరోవైపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ స్తానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 6న ఒకే విడతలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.