Land For Jobs Scam: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే తేజస్వీ యాదవ్ సీబీఐ ముందు హాజరు కాబోరని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీ నేతల ఇండ్లపై దర్యాప్తు సంస్థల దాడులపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. 2017లో జేడీయూ, ఆర్జేడీ విడిపోయినప్పుడు దాడులు జరిగాయి.. ఇప్పుడు కలిసినందుకు మళ్లీ దాడులు జరుగుతున్నాయని అన్నారు.
Bihar Chief Minister Nitish Kumar: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణాకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు ఆర్జేడీ నాయకుల ఇండ్లపై దాడులు చేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. 2017లో జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్ విడిపోయినప్పుడు ఈ దాడులు జరిగాయనీ, ఇప్పుడు తమ పార్టీలు కలిసి వచ్చినప్పుడు దాడులు జరుగుతున్నాయని అన్నారు.
"... ఇది 2017లో జరిగింది. అప్పుడు మేం (జేడీయూ-ఆర్జేడీ) వేర్వేరు మార్గాల్లో వెళ్లాం. 5 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు మేము కలిసినప్పుడు, మళ్లీ దాడులు జరుగుతున్నాయి.. ?...ఇందులో నేను చెప్పేంది ఏముంది?.. విపక్షాలు ఐక్యంగా ఉన్నందునే కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయి" అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. విపక్షాలు ఐక్యంగా ఉన్నందునే కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంబంధిత వర్గాల నివాసాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఆర్జేడీ నేతను ఢిల్లీలోని ఆయన నివాసంలో 11 గంటలకు పైగా విచారించిన అనంతరం ఈడీ బృందం బయలుదేరింది.
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బంధువులపై ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), బీహార్ లోని పలు ప్రాంతాల్లో ఈడీ శుక్రవారం దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతితో పాటు బీహార్ లోని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబూ దోజానా నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ, ఎన్సీఆర్, బీహార్ లోని 15కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ఈ స్థలాల్లో ఈడీకి చెందిన పలు బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ ప్రాంతాల్లో అనుమానితుల నివాసాలు, కార్యాలయాల స్థలాలు, ఉద్యోగాల కోసం భూకుంభకోణంలో భాగమైన లబ్ధిదారులు ఉన్నారు.
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసును పరిగణనలోకి తీసుకొని ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసీఐఆర్) దాఖలు చేసిన తరువాత మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ భూముల కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ బృందం ప్రశ్నించిన కొద్ది రోజులకే ఫెడరల్ ఏజెన్సీ ఈ సోదాలు నిర్వహించింది. రెండు సెషన్లలో లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ మంగళవారం దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది.
లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని కూడా సీబీఐ సోమవారం పాట్నా (బీహార్) నివాసంలో ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 15న తమ ముందు హాజరుకావాలని లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు గత నెలలో సమన్లు జారీ చేసింది.
