Nanded: నాందేడ్ లో హోలీ రోజున జొమాటో డెలివరీ బాయ్ పై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. దుండగులు అతనిపై దాడి చేసి, తన్నడంతో పాటు చెక్క దుంగతో దాడి చేసినట్టు వీడియో దృశ్యాల్లో కనిపించింది.
Zomato delivery boy assaulted on Holi: మహారాష్ట్రలోని నాందేడ్ లో హోలీ పండుగ సందర్భంగా జొమాటో డెలివరీ బాయ్ పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నలుగురిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో అమ్రాన్ తంబోలి అనే న్యాయ విద్యార్థి తన ఆర్డర్ గురించి సెల్ ఫోన్ చెక్ చేస్తుండగా ఫిబ్రవరి 7న నిందితుల బృందం అతనిపై దాడి చేయడం ప్రారంభించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దుండగులు అతనిపై దాడి చేసి, తన్నడంతో పాటు చెక్క దుంగతో కొట్టడం చేశారు. ఆర్డర్ డెలివరీ చేసి తాను మరో ఆర్డర్ కోసం ఫోన్ చెక్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
దాడి అనంతరం జొమాటో డెలివరీ బాయ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. లా కోర్సు మొదటి సంవత్సరం విద్యార్థి, తన చదువుకు ఆర్థికంగా తోడ్పాటుకోసం జొమాటోలో డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. తనపై దాడి చేసిన తర్వాత నిందితులు మళ్లీ తిరిగి వచ్చి తన ముఖంపై రంగులు పూసి నుదుటిపై తిలకం వేశారని ఆరోపించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
