Rakesh Tikait: రైతు నాయకుడు రాకేష్ టికాయత్ పై జరిగిన ఇంక్ దాడి కేసులు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. భారత రక్షణ వేదిక అధ్యక్షుడు భరత్ శెట్టి, శివకుమార్, ప్రదీప్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసకున్నారు.
Karnataka Police: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ సింగ్ టికాయత్ పై ఇంక్ దాడి చేసిన ముగ్గురు నిందితులు యూ-టర్న్ తీసుకున్నారని మరియు కన్నడలో మాట్లాడనందుకు అతనిపై దాడి చేశారని పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి. నిందితుల వాంగ్మూలాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టికాయత్ పై నల్లరంగుతో పలువురు దాడి చేశారు. భారత రక్షణ వేదిక అధ్యక్షుడు భరత్ శెట్టి, శివకుమార్, ప్రదీప్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేస్తున్నప్పుడు, పోలీసులు తీసుకువెళుతున్న సమయంలో నిందితులు ప్రధాని నరేంద్ర మోడీ పేరు నినాదాలు చేశారు. ఈ పరిణామాన్ని దర్యాప్తు అధికారులు ముందస్తు చర్యగా చూస్తున్నారు. నిందితుల ప్రకటన తప్పుదారి పట్టించే విధంగా ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై తోతైన విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
రాకేష్ టికాయత్ పై ఇంక్ దాడి చేసిన నిందితులను పోలీసులు 6 రోజుల రిమాండ్‌కు తరలించారు. విచారణలో నిందితుల గత నేర చరిత్ర కూడా బయటపడింది. శివకుమార్ వేదికపైకి దూసుకెళ్లి రాకేష్ టికాయత్ పై దాడి చేసి, ఇతర వ్యవసాయ నాయకులపై కూడా ఇంక్ దాడికి ప్రయత్నించాడు. విచారణలో శివకుమార్ హత్యకేసులో నిందితుడని, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించినట్లు తేలింది. అతను 2015లో లో సత్పవర్తన కింద విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత, అతను తన సోదరితో కలిసి ఒక సంస్థలో చురుకుగా ఉన్నాడు. అనేక నిరసనలలో పాల్గొన్నాడు. ఇతర నేరాల్లో అతడి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరో నిందితుడు ప్రదీప్ క్యాబ్ డ్రైవర్. అతను రాకేష్ టికైత్ మరియు ఇతరులపై నల్ల పెయింట్ పోశాడు. ఆ రోజు కార్యక్రమంలో నిందితులతో కలిసి కనిపించిన మహిళల కోసం కూడా పోలీసులు వేట ప్రారంభించారు. ఘటన తర్వాత వీరంతా అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు.
కర్నాటక రాష్ట్ర రైతు సంఘం మరియు హరి సేన ఆధ్వర్యంలో “రైత చలువలి, ఆత్మావలోకన హాగు స్పష్టీకరణ సభ సమావేశంలో కొందరు దుండగులు .. నల్ల ఇంక్ చల్లారు. అంతటితో ఆగకుండా.. కుర్చీలతో దాడికి యత్నించారు. తర్వాత.. రాకేష్ టికాయత్ మద్దతుదారులు నిందితుడిని పట్టుకుని కొట్టారు. అదే సమయంలో.. కార్యక్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున రైతు ఉద్యమాన్ని ప్రారంభించిన రాకేష్ టికాయత్ పై ఓ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చేందుకు వచ్చానని, అందులో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి టికాయత్ తెలిపారు. ఈ సమయంలో ఓ దుండగుడు రాకేష్ టికాయత్ తో పాటు, యుధ్వీర్ సింగ్‌పై కూడా సిరా విసిరారు. ఈ సందర్భంగా గొడవ కూడా జరిగింది. ఈ ఘటన రాష్ట్రానికి నల్ల మచ్చగా కాంగ్రెస్ అభివర్ణించింది.
