ఓ భర్త తన భార్యను దారుణంగా హతమార్చాడు. అనంతరం ఏమీ తెలియనట్టు నటించాడు. తన భార్య చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయిందని అందరినీ నమ్మించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. దీంతో అతడిని అరెస్టు చేశారు.
ఓ భర్త తన భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను ఘోరంగా హతమార్చి ఇంటి వెనకాలే పూడ్చిపెట్టాడు. తరువాత తనకేమీ తెలియదన్నట్టుగా నటించాడు. కానీ పోలీసు దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. ఈ ఘటన హర్యానాలోని యమునానగర్ లో వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
వివరాలు ఇలా ఉన్నాయి. యమునానగర్ జిల్లా రాదౌర్ లోని శివ్ కాలనీకి చెందిన రాకేష్ కుమార్ కు 2005లో రీనా రాణి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాకేష్ సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. అయితే రీనా రాణి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీనిపై రాకేష్ కుమార్ రీనా సోదరిడికి సమాచారం ఇచ్చాడు.
దీంతో ఆయన రౌదౌర్ కు చేరుకొని సోదరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. దీంతో తన బావ తీరుపై అనుమానం వచ్చింది. అయితే తన సోదరి ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని అతడు రాకేష్ ను గట్టిగా ప్రశ్నించాడు. భయపడిపోయిన రాకేష్.. తానే రీనా రాణిని హత్య చేసి ఇంటి వెనకాల పూడ్చిపెట్టానని చెప్పాడు.
అనంతరం వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ గుర్మెల్ సింగ్, ఫోరెన్సిక్ విభాగం బృందం ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడి రాకేష్ ను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. కాబట్టి అతడిని రిమాండ్ కు అప్పగించాలని కోరుతూ కోర్టులో సోమవారం హాజరుపరుస్తామని రాదౌర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) అనంత్ రామ్ చెప్పారు.
