Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. 4 కుక్క పిల్లలను ఉద్దేశపూర్వకంగా కారుతో గుద్దిన డ్రైవర్.. అరెస్టు చేసిన పోలీసులు

ఉద్దేశపూర్వకంగా కుక్కపిల్లలపై కారు పోనిచ్చిన డ్రైవర్ ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మట్టిరోడ్డుపై ఆడుకుంటున్న కుక్కలను క్రూరంగా ఓ కారు ఢీకొట్టడంతో జంతుప్రేమికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Atrocious.. Police arrested the driver who deliberately hit 4 puppies with the car.
Author
First Published Dec 19, 2022, 10:19 AM IST

ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆడుకుంటున్న 4 కుక్కపిల్లలపై ఓ కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా వాహానాన్ని ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ కుక్క పిల్ల చనిపోయింది. దీంతో డ్రైవర్ పై కేసు నమోదైంది. తాజాగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు భయపడబోను - పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో

వివరాలు ఇలా ఉన్నాయి. ఫరీదాబాద్ బల్లభ్‌గఢ్‌లోని ఓ కూడలి వద్ద ఓ కుక్క తన నాలుగు కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉంది. అయితే ఈ క్రమంలో ఓ కారు అటుగా వచ్చింది. అయితే వాటిని తప్పుకునేలా సూచించేందుకు హారన్  కొట్టకుండా, కారు ఆపకుండా వాటిపై నుంచే వేగంగా పోనిచ్చాడు. దీంతో అన్ని కుక్కలు చెల్లాచెదురయ్యాయి. కానీ ఓ కుక్క పిల్ల కారు టైరు కింద నలిగిపోయింది.

త్రిపుర ఈశాన్య రాష్ట్రాలకు అంతర్జాతీయ వాణిజ్య గేట్‌వేగా ఎదుగుతోంది: ప్రధాని మోడీ

ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశాడని ఆ వీడియోల్లో స్పష్టమవుతోంది. దీంతో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ విషయంలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిపై జంతు క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన డిసెంబర్ 12వ తేదీన జరిగిందని ఆ వీడియోల్లో తెలుస్తోంది. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆదివారం అరెస్టు చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios