దారుణం.. బాకీ కట్టలేదని ఆరో తరగతి చదివే కూతురును తీసుకెళ్లి రెండో పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి..

బాకీ కట్లడం లేదని ఓ కుటుంబంలోని మైనర్ బాలికను ఓ వ్యక్తి బెదిరించి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం రహస్యంగా ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Atrocious.. A 40-year-old man took his daughter studying in sixth class and got married for the second time because he did not pay the dues..ISR

బీహార్ లో దారుణం జరిగింది. బాకీ కట్టలేదని ఓ కుటుంబంలోని ఆరో తరగతి చదివే 14 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మూడు నెలల పాటు నిర్బంధించాడు. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు రావణుడి కంటే ఎక్కువ అహం - రెజ్లర్ వినేశ్ ఫోగట్

వివరాలు ఇలా ఉన్నాయి. సివాన్ జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఓ కుటుంబం తన దూరపు బంధువైన మహేంద్ర పాండే దగ్గర రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. కానీ వివిధ కారణాల వల్ల ఆ బాకీని తిరిగి అతడికి చెల్లించలేకపోయింది. దీనిని అతడు ఆసరాగా తీసుకున్నాడు. ఆ కుటుంబంలో ఆరో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. 

16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్.. వెంటనే అత్తకు ప్రమోషన్..

ఆ కుటుంబం వద్దకు వచ్చి బాకీ కట్టాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ నిస్సాహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబం అప్పు కట్టలేకపోయింది. దీంతో వారిని బెదిరించాడు. కుటుంబంలోని మైనర్ బాలికను తన ఇంటికి పంపించాలని బెదిరించాడు. తన ఇంటికి తీసుకెళ్తానని, ఆమె చదువుకునేందుకు కూడా సహకరిస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. అనంతరం బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. కానీ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనంలో తెలిపింది. ఆమెను మూడు నెలల పాటు ఇంట్లోనే నిర్భందించాడు.

కాలేజీ ఫీజు కోసం స్నేహితుల సాయం కోరిన యువతి.. హోటల్ లో బంధించి మూడు రోజులు అత్యాచారం

అయితే పలువురి వ్యక్తుల ద్వారా కూతురు పెళ్లి వార్త తల్లికి తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విచారణలో మహేంద్ర పాండే తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై బాల్య వివాహ చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనకు 14 రోజుల రిమాండ్ కు తరలించారు.

కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డి అస్వస్థతకు కారణమేమిటో తేల్చేసిన డాక్టర్లు..

కాగా.. మూడు నెలల పాటు ఆమె ఇంట్లోనే ఉండడంతో చిన్నారిని వైద్య పరీక్షలకు తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని పోలీసులు మీడియాకు తెలిపారు. నిందితుడు బాధిత కుటుంబానికి దూరపు బంధువు అవుతాడని చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios