తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న ఓ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొంది. వ్యాన్ పోల్‌ను ఢీకొన్న తర్వాత కొంత దూరం దొర్లుకుంటూ వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో పది మంది గాయపడ్డారు.
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతూరు జిల్లా జవదుమలై ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఆ వ్యాన్‌లో 26 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిసింది.
26 మందితో ఆ మినీ వ్యాన్ వేగంగా వెళ్లినట్టు సమాచారం. అయితే, ఆ వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ ఉన్నట్టుండి నిద్రలోకి జారిపోయినట్టు భావిస్తున్నారు. ఇలా డ్రైవర్‌కు కన్నంటుకోవడంతో ఆ మినీ వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టుకున్నట్టు తెలుస్తున్నది. వేగంగా వెళ్తున్న వ్యాన్ పోల్‌ను ఢీకొట్టుకోవడంతో ఆ వాహనం కొంత దూరం మేరకు రాసుకూ దొర్లుతూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కాగా, మరో పది మందికి గాయాలయ్యాయి.
ఇదిలా ఉండగా, తెలంగాణలోనూ పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. జిల్లాలోని చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను సూర్యాపేట జిల్లా నేరేడుచర్లవాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
