నాగపూర్: మహారాష్ట్రలో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. మహరాష్ట్రలోని చంద్రపూర్ లో శనివారం రాత్రి వ్యాన్ ను ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది మరణించారు.

మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 14 మంది ఉన్నారు. వారు కోర్పానా - వాని రోడ్డుపై ప్రయాణిస్తుండగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదంలో 10 మంది మరణించినట్లు తెలిసిందని చంద్రాపూర్ పోలీసు సూపరింటిండెంట్ మహేశ్వర రెడ్డి చెప్పారు. 

సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి కథనం ప్రకారం - ఏడుగురు మహిళలు, వ్యాన్ డ్రైవర్, మూడేళ్ల చిన్నారి, మరో మైనర్ మరణించారు.

ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఏడాది చిన్నారి గాయాలు కూడా కాకుండా బయటపడింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.