Asianet News TeluguAsianet News Telugu

Atal Bihari Vajpayee Death Anniversary: వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 

Atal Bihari Vajpayee Death Anniversary PM Modi President Murmu pay Tributes at Sadaiv Atal
Author
First Published Aug 16, 2022, 10:01 AM IST

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి 4వ వర్దంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం Sadaiv Atal వద్ద పుష్పాంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సహా పలువురు వాజ్‌పేయికి నివాళులర్పించారు. వాజ్‌పేయి జ్ఞాపకార్థం జరిగిన ప్రార్థనా సమావేశానికి కూడా వారు హాజరయ్యారు.

బీజేపీ నాయకులతోపాటు వాజ్‌పేయి దత్తపుత్రిక Namita Kaul Bhattacharya కూడా సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. ఇక, జనాల మనిషిగా పేరుపొందిన అటల్ బిహారీ వాజ్‌పేయి.. 1998-2004 మధ్య ఆరేళ్ల పాటు ప్రధానిగా దేశ ప్రధానిగా కొనసాగారు. వాజ్‌పేయిని భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన 93 ఏళ్ల వయసులో 2018లో మరణించారు. 

 


మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘‘నా గురువు, దిగ్గజ నాయకుడు, కవి, తత్వవేత్త, మంత్రముగ్ధులను చేసే వక్త, అజాతశత్రువు లక్షలాది మంది ఆరాధించే మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా ఆయన స్మృతికి భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన కాలంలోని అత్యున్నత నాయకుడికి నా నివాళులు అర్పిస్తున్నాను’’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios