New Delhi: నైరుతి ఢిల్లీలోని డాబ్రీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 70 మంది విద్యార్థులు శుక్రవారం ఆసుపత్రి పాల‌య్యారు. ఈ క్ర‌మంలోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంస్థ‌కు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, ప్ర‌స్తుతం పిల్లలందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, పాఠశాల విద్యార్థులకు సరైన ఆహారం అందేలా చూడాలని మధ్యాహ్న భోజన ప్రొవైడర్లను హెచ్చరించామని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

70 Students Fall Sick From Midday Meal: నైరుతి ఢిల్లీలోని ఒక‌ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 70 మంది విద్యార్థులు శుక్రవారం ఆసుపత్రి పాల‌య్యారు. ఈ క్ర‌మంలోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంస్థ‌కు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, ప్ర‌స్తుతం పిల్లలందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, పాఠశాల విద్యార్థులకు సరైన ఆహారం అందేలా చూడాలని మధ్యాహ్న భోజన ప్రొవైడర్లను హెచ్చరించామని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని సర్వోదయ బాల విద్యాలయ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు కావడంతో సుమారు 70 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సాగర్ పూర్ లోని దుర్గాపార్క్ లోని సర్వోదయ బాల విద్యాలయ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 6 నుంచి 8వ తరగతి వరకు సుమారు 70 మంది మగ విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు సాయంత్రం 6 గంటల సమయంలో సాగర్ పూర్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ వచ్చిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నైరుతి) మనోజ్ సీ తెలిపారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం విద్యార్థులను డీడీయూ ఆస్పత్రి, డాబ్రీలోని దాదా దేవ్ ఆస్పత్రికి తరలించినట్లు గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు సోయా జ్యూస్ ఇవ్వడంతో కడుపునొప్పి, వాంతులు అయ్యాయని పాఠశాల యాజమాన్యం తెలిపింది. క్రైమ్ టీంను ఘటనా స్థలానికి పిలిపించి ఆహారం, జ్యూస్ అవశేషాలను ఆధారాలుగా సేకరించారు. మధ్యాహ్న భోజనంలో పూరీ సబ్జీ వడ్డించిన తర్వాత 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సోయా జ్యూస్ పంపిణీ చేశారు. క‌డుపులో నొప్పిగా ఉందని ఫిర్యాదులు అందడంతో ఆహారం, జ్యూస్ పంపిణీని నిలిపివేసినట్లు డీసీపీ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తగిన సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామని డీసీపీ తెలిపారు.