మహారాష్ట్ర థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. 

ఈ విషాద ఘటన థానేజిల్లాలోని ఉల్హాస్ నగర్ లో శుక్రవారం రాత్రి పది గంట సమయంలో చోటు చేసుకుంది. ఉల్హాస్ నగర్ లోని నెహ్రూ చౌక్ వద్దనున్న సాయిసిద్ధి అపార్ట్ మెంట్లోని ైదో అంతస్తులో స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 

ఆ స్లాబ్ కూలి అది కిందపడడంతో మిగతా అంతస్తుల్లోని కొన్ని ప్లాట్లు కూడా కుప్ప కులాయి. దీంతో అపార్ట్ మెంట్ కు పెద్ద రంధ్రం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం (ఎన్ డీఆర్ఎఫ్) స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. 

భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారినిి రక్షించారు. అయితే అప్పటికే ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారని ఉల్లాస్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక టీనేజర్ ఉన్నారు. 

26యేళ్ల క్రితం నిర్మించిన ఈ అపార్ట్ మెంట్లో 29 ప్లాట్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.