Asianet News TeluguAsianet News Telugu

BMW cars : అగ్నికి ఆహుతైన 45 బీఎండబ్ల్యూ కార్లు.. గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం...

ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో ఉన్న 40 నుంచి 45 వాహనాలు మంటల్లో దహనం అయ్యాయని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు చాలాసేపు శ్రమించారు. 10 ఫైర్ టెండర్లతో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

at least 45 BMW cars charred in a godown in navi mumbai
Author
Hyderabad, First Published Dec 8, 2021, 2:52 PM IST

ముంబై : ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.  తుర్భే ఎంఐడీసీలో జరిగిన ఈ ప్రమాదంలో 40 బీఎండబ్ల్యు(BMW) కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో మంటలు చెలరేగడంతో దాదాపు నలభై కి పైగా కార్లు దగ్ధం అయినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Army chopper crash: ఊటీలో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. అందులో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్!

కోట్ల రూపాయల నష్టం వాటిల్లిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో ఉన్న 40 నుంచి 45 వాహనాలు మంటల్లో దహనం అయ్యాయని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు చాలాసేపు శ్రమించారు. 10 ఫైర్ టెండర్లతో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

అయితే..  ఈ ప్రమాదంలో ఎంత మేరకు  నష్టం జరిగిందో ఇప్పటివరకు  కంపెనీ ప్రతినిధులు వెల్లడించలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎంఐడిసి ఫైర్ సర్వీసెస్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆర్ బి పాటిల్ తెలిపారు.  అక్కడ పార్క్ చేసిన కొన్ని వాహనాలు దహనమయ్యాయి అని తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios