Bellary: కర్ణాటకలో క‌లుషిత నీరు తాగి 21 మంది అస్వస్థతకు గుర‌య్యారు. ఇదే ప్రాంతంలో ఇంకా రోజుకు 4-5 కేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ట్రోఎంటెరిటిస్ మొదటి కేసు మార్చి 25న  నమోదైంది. 

Contaminated Water in Kuntanala village: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇక్కడ క‌లుషిత‌ నీరు తాగి ఒక గ్రామంలోని చాలా మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. బళ్లారి జిల్లా కుంటనాల గ్రామంలో కలుషిత నీరు తాగి 21 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ప్రజలు వాంతులు, వికారంతో బాధపడుతున్నారు. గ్రామంలోని తాత్కాలిక ఆరోగ్య శిబిరంలో వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని బళ్లారిలోని విజయనగర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్ ) ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. విమ్స్ లో ముగ్గురు, జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 13 మంది చికిత్స పొందారు. 

మొదటి కేసు మార్చి 25న న‌మోదైంది..

కుంట‌నాల‌ గ్రామంలో ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ యూనిట్ ను ప్రారంభించారు. ఓ ఇంట్లో ముగ్గురు పిల్లలు, వారి తండ్రి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందింది. జిల్లా నుంచి ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. మార్చి 25వ తేదీన గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసు నమోదు కాగా, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే వైద్యాధికారులు గ్రామానికి చేరుకుని మంచినీటి పరీక్షలు నిర్వహించారు. ప్రజలు అస్వస్థతకు గురికావడానికి ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమేనని టెస్ట్ రిపోర్టు నిర్ధారించింది.

ప్రతిరోజూ 4-5 కొత్త కేసులు వస్తున్నాయి..

సమాచారం అందిన వెంటనే కుంట‌నాల గ్రామంలోని వాల్మీకి భవన్ లో ఆరు పడకల ఎమర్జెన్సీ క్లినిక్ ను ప్రారంభించామనీ, వైద్యుల బృందం కూడా గ్రామానికి చేరుకుందన్నారు. ప్రతిరోజూ 4-5 మందికి గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఫిర్యాదులు వస్తున్నాయి. వాల్మీకి భవన్ లో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఫిల్టర్ వాటర్ తాగిన వారు కూడా అస్వస్థతకు గురికావడంతో మరింత దర్యాప్తు చేశాం. గ్రామంలో కేసులన్నీ ముగిసే వరకు క్లినిక్ నిర్వహిస్తాంమ‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

ఈ గ్రామంలో 3324 మంది జనాభా ఉన్నారనీ, తాగునీటి సరఫరా కోసం వేదవతి నదిపై ఆధారపడి జీవిస్తున్నారని రూపనోడి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రకాశ్ సి అమర్ శెట్టి తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 10 కుటుంబాలు మాత్రమే గ్యాస్ట్రోఎంటెరిటిస్తో బాధపడుతున్నాయి. దీనిపై వైద్యాధికారులు విచారణ జరుపుతున్నారు. దీంతోపాటు గ్రామంలో జేజేఎం ఆధ్వర్యంలో కొత్తగా నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు పనులు చేస్తున్నారు.