Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా పలువురు గాయపడగా, మైనర్‌ను ఆస్పత్రికి తరలించారు.  

10 killed in road accident in Chhattisgarh: పెళ్లికి వెళ్తుండ‌గా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో కారు-ఒక ట్ర‌క్కు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం సంఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తరి జిల్లాలో బుధవారం అర్థ‌రాత్రి బొలెరో కారు ట్రక్కును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహా పలువురికి గాయాలు కాగా, మైనర్ ను ఆసుపత్రికి తరలించారు. జగత్రా సమీపంలోని కాంకేర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సోరం నుంచి మర్కటోలా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స‌మాచారం. బలోద్ జిల్లాలోని జగత్రా సమీపంలో ట్రక్కు, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందగా, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు బలోద్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రాయ్ పూర్ కు తరలించారు. ప్ర‌మాదం త‌ర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. అత‌ని కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఈ దుర్ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి కావడంతో మృతుల‌ పేర్లను వెల్లడించలేకపోయారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదే సమయంలో ట్రక్కు గురించి పెద్దగా సమాచారం వెల్లడించలేదు.

Scroll to load tweet…