Asianet News TeluguAsianet News Telugu

75 ఏళ్ల స్వాతంత్ర భారతం.. ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు..

స్వాతంత్రం అనంతరం కూడా భారత్ పలు స్వదేశీ తిరుగుబాట్లు, ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొంటుంది. వాటిని ఎదుర్కొవడాని పలు అవరోధాలను అధిగణించింది. అంతర్గత భద్రతను నిర్వహించే బాధ్యత పోలీసు, పారామిలిటరీ బలగాలు, అసాధారణమైన కేసుల్లో సైన్యం చేతుల్లో ఉంటుంది. 

At 75 India is ready to tackle  internal, external security threats KRJ
Author
First Published Aug 7, 2023, 2:49 PM IST

భారత్ స్వాతంత్ర పూర్వమే కాకుండా.. స్వాతంత్ర్యం అనంతరం కూడా పలు స్వదేశీ తిరుగుబాట్లు, ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొంటుంది. ఇతర దేశాల నుండి వచ్చే బాహ్య బెదిరింపులతో ఆందోళన చెందుతున్న తరుణంలో.. దేశ అంతర్గత భద్రత కూడా ఓ సమస్యగా మారింది. అయినా భారత్ శాంతియుతంగా,విశ్వాసంతో, సమర్థతతో బాహ్య బెదిరింపులను ఎదుర్కోంటుంది.

స్వాతంత్ర్యం పొందే సమయంలో భారతదేశం..  విభజన సవాళ్లు, దాని పరిణామాలు, మత హింస, కాశ్మీర్ సమస్య, రాచరిక రాష్ట్రాల ఏకీకరణ,  పేదరికం (సుమారు 80%), నిరక్షరాస్యత (అక్షరాస్యత స్థాయి 12%), తక్కువ ఆర్థిక సామర్థ్యం, భాషాపరమైన సంస్థ, వేర్పాటువాద ధోరణులు వంటి పలు అంతర్గత భద్రతా సమస్యలను  ఎదుర్కొంది.

తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ప్రముఖ నాయకుల నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పలు అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. దేశనిర్మాణంపై దృష్టి సారిస్తునే.. నూతన ప్రజాస్వామ్య, లౌకిక గుర్తింపు పెంపొందించింది. కానీ.. పలు సందర్భాల్లో స్వతంత్ర భారత దేశం సుస్థిరతను కాపాడుకుంటూ.. దేశ భవిష్యత్తు, అభివృద్ధికి పునాది వేయడానికి భద్రత అడ్డంకులను అధిగమించడం సమస్యగా మారింది.  

స్వాతంత్ర్య ఉద్యమం ముగిసిన తర్వాత.. ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్తతలు, పాకిస్తాన్ (1965, 1971),చైనా (1962)తో యుద్ధాలను భారత్ ఎదుర్కొవల్సి వచ్చింది. అలాగే.. అంతర్గత, బాహ్య శక్తుల వల్ల కలిగే సమస్యలను దేశం ఎదుర్కోవడం ప్రారంభించింది. 

అంతర్గత, బహిర్గత భద్రతా సమస్యల కాలక్రమానుసారం
 
కాశ్మీర్ సంఘర్షణ (1947- నేటీ వరకు): భారతదేశానికి తలమానికంగా ఉన్న కాశ్మీర్ లో స్వాతంత్ర ఉద్యమం నుంచి నేటీవరకు సంఘర్షణ జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకోవడానికి లేదా నిర్మూలించడానికి భారత్ పలు కఠిన చర్యలు తీసుకుంది. తీసుకుంటూనే ఉంది. ఇలా ఆరని చిత్తిలాగా మారింది. 

నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాట్లు: స్వాతంత్ర్య భారతంలో 1960 చివరి నాటి నుంచి నేటి వరకు పలు మార్లు నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాట్లు, దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ గ్రామం నుండి ఉద్భవించిన నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా మధ్య , తూర్పు రాష్ట్రాలలో సాయుధ తిరుగుబాటుకు దారితీసింది.

ఎమర్జెన్సీ సమయం: భారతదేశంలో జూన్ 1975 నుండి మార్చి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కులను నిలిపివేయడం, అధికార కేంద్రీకరణ కారణంగా భారత్ పలు అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కొంది. ఎమర్జెన్సీని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలంగా మిగిలిపోయింది. ఏకపక్ష నిర్బంధాలు,అరెస్టులు, బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు, రాజకీయ అణచివేత, మీడియా అణిచివేత, ప్రజాస్వామ్య విలువల క్షీణత మొదలైనవి ప్రభుత్వ సంస్థలను అసమర్థంగా మార్చడం వంటి పలు అప్రజాస్వామిక చర్యలు చోటుచేసుకున్నాయి.

పంజాబ్ తిరుగుబాటు (1980-1990): పంజాబ్‌లోని సిక్కు వేర్పాటువాద ఉద్యమం. దీనినే ఖలిస్తాన్ ఉద్యమం అని పిలుస్తారు. దీని ఫలితంగా 1980-1990 మధ్యకాలంలో గణనీయమైన అంతర్గత భద్రతా సవాళ్లు ఎదురయ్యాయి.

అస్సాం, ఈశాన్య తిరుగుబాట్లు (1979- నేటీ వరకు): భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో వివిధ వేర్పాటువాద, తిరుగుబాటు ఉద్యమాలు, పలు అంతర్గత భద్రత సవాళ్లలు నిరంతరం ఎదురవుతున్నాయి.  

తీవ్రవాదం, సరిహద్దు దాడులు (1980ల-2021): ఇప్పటి వరకు భారతదేశం అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొంది. సరిహద్దు అంశం విషయంలో ప్రధానంగా చైనా, పాకిస్తాన్ లతో నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఈ సమస్య అంతర్గత భద్రతా ఆందోళనలకు దారితీసింది.

మతపరమైన ఉద్రిక్తతలు: భారతదేశంలో అప్పుడప్పుడు మతపరమైన ఉద్రిక్తతలు కూడా తల్లెత్తున్నాయి. ఇవి ప్రధానంగా అంతర్గత భద్రతకు సవాళ్లుగా మారుతోంది. 

సైబర్‌ సెక్యూరిటీ బెదిరింపులు(2000ను ప్రారంభం): టెక్నాలజీ వృద్ధితో, హ్యాకింగ్, డేటా ఉల్లంఘనలు, ఆన్‌లైన్ రాడికలైజేషన్‌  వంటి పలు నేరాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సైబర్‌స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బయోలాజికల్ వెక్టర్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పురోగతి కూడా అంతర్గత భద్రతకు సమస్యగా మారుతోంది. 

రాజకీయ అశాంతి: నిరసనలు, ప్రదర్శనలు, అల్లర్లు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు కూడా అంతర్గత భద్రతకు ఆటంకాలుగా మారుతున్నాయి.  

గూఢచర్యం, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు: విదేశీ ఏజెంట్లు లేదా గూఢచార సంస్థల చొరబాటు సున్నితమైన సమాచారాన్ని సేకరించడానికి లేదా జాతీయ విధానాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ISIS,అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలు దాడులకు తెగబడుతున్నాయి. ప్రత్యేకించి పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు వాటి కేంద్రాలుగా మారుతున్నాయి. అదే సమయంలో వామపక్ష తీవ్రవాదం, రాష్ట్ర భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ వంటి కార్యకలాపాలలో నేర సంస్థలు నిమగ్నమయ్యాయి. 

క్లుప్తంగా చెప్పాలంటే.. 1947 నుండి నేటీ వరకు అంతర్గత భద్రత ప్రయాణంలో భారత్ ఎన్నో అవరోధనాలు అధిగమించింది. “భిన్నత్వం మధ్య ఏకత్వం” అని మనం ఎప్పటి నుంచో జరుపుకునే ఈ బహుళత్వ దేశంలో సురక్షితమైన అంతర్గత భద్రత కోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.  

భద్రత విషయంలో భారత్ తీసుకున్న చర్యలిలా..  

పోలీసు వంటి సంస్థలకు సాధికారత కల్పించడమే కాకుండా.. 2008లో NIA వంటి సంస్థల ఏర్పాటు, అన్ని గూఢచార సంస్థలతో కలిసి మల్టీ-ఏజెన్సీ సెంటర్ (MAC), నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (NATGRID) ఫ్రేమ్‌వర్క్‌గా రూపొందించబడింది. ఇది సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావితం చేస్తుంది. దేశంలో ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను మెరుగుపరచడానికి నియమించబడిన డేటా ప్రొవైడర్‌లతో ఆమోదించబడిన వినియోగదారు ఏజెన్సీలను (భద్రత/చట్ట అమలు)అనుసంధానం చేయడం, యాంటీ టెర్రరిజం సెల్ ఏర్పాటు చేయడం వంటివి దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాయి. 

మణిపూర్, హర్యానాల్లో హింసాత్మక ఘటనలు, CAA, రైతుల ఆందోళన, సోషల్ మీడియా, AI ఉపయోగించడం వంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ, గోథే ప్రిస్క్రిప్షన్ “నివారణ కంటే ముందస్తు జాగ్రత్తలు ఉత్తమం” అనే సూచనను పాటించడం ద్వారా అంతర్గత భద్రత కట్టుదిట్టంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ శాంతియుతంగా  “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” జరుపుకుంటుందనే నమ్మకం ఉంది. 

రచయిత: పల్లబ్ భట్టాచార్య

Follow Us:
Download App:
  • android
  • ios