Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ సోమవారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్ర‌మంలో అక్క‌డ నిర్వ‌హించే బహిరంగ ర్యాలీలో ఆయ‌న ప్రసంగించ‌నున్నారు.  

Gujarat Assembly elections: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మరోసారి గుజరాత్‌లో పర్యటించనున్నారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేజ్రీవాల్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్ సోమనాథ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారని, అలాగే రాష్ట్రంలో కూడా పర్యటిస్తారని ఆప్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాదిలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజ‌యం సాధించి అధికార‌పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నాయి. 

ఈ క్ర‌మంలోనే ఆప్ గుజ‌రాత్ లో పాగా వేయాల‌ని చూస్తోంది. పంజాబ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన అనంత‌రం ఇత‌ర రాష్ట్రాల్లో విస్తరించే ప్ర‌ణాళిక‌ల‌ను ఆప్ వేగ‌వంతం చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గత గురువారం సూరత్‌ను సందర్శించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, గృహ వినియోగదారులందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని తెలిపారు. అలాగే, గురాత్‌లోని నగరాలు, గ్రామాలకు 24×7 విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని సూరత్‌లో మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. 31 డిసెంబర్ 2021 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు జూలై 26న గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిని, వారి కుటుంబాలను ఢిల్లీ సీఎం కలిశారు. గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో రసాయనాలు కలిపిన మద్యం/నకిలీ మద్యం సేవించడం వల్ల కనీసం 28 మంది మరణించారు. “భవ్‌నగర్‌లో కల్తీ మద్యం తాగి 25 మందికి పైగా చనిపోయారని, మరికొందరు ఆసుపత్రుల్లో చేరారని చాలా విచారకరమైన సంఘటన నాకు తెలిసింది. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో బహిరంగంగా మద్యం ఎలా విక్రయిస్తున్నారని, దీని వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు చూసుకోవడం లేదు? దీని వెనుక ఏదైనా అంతర్గత కుట్ర ఉందా?” అని ప్ర‌శ్నించారు. గుజరాత్‌లో వేల కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బాధితులు మరియు వారి కుటుంబాలను కలిసిన తర్వాత, కేజ్రీవాల్ మాట్లాడుతూ.."గుజరాత్ ప్రజలు నకిలీ మద్యం కారణంగా మరణించడం ఇదే మొదటిసారి కాదు" అని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిప‌డ్డారు. 

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వ్యక్తులను, వారి కుటుంబాలను కేజ్రీవాల్ కలిశారు. గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో రసాయనాలు కలిపిన మద్యం లేదా నకిలీ మద్యం తాగడం వల్ల మరణించిన వారి సంఖ్య 28కి చేరుకోగా, బర్వాలా, రాన్‌పూర్ మరియు అహ్మదాబాద్ రూరల్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం సేవించి డజనుకు పైగా ఆస్పత్రి పాలయ్యారు. బొటాడ్, బన్వాలా, ధంధూక తాలూకాలలో రసాయన దుర్వినియోగం ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు.