పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో తొలి దశ పోలింగ్: 30 సీట్లలో టీఎంసీ సిట్టింగ్ సీట్లు 26

పశ్చిమ బెంగాల్, అస్సాం శాసనసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ శనివారం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లో 30 స్థానాలకు, అస్సాంలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Assembly elections 2021: 30 seats in West Bengala, 47 in Assam voting today

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తొలి దశ పోలింగ్ శనివారంనాడు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లో 30 సీట్లకు, అస్సాంలో 47 సీట్లకు తొలి దశ పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ లోని తొలి దశ పోలింగ్ జరుగుతున్న 30 సీట్లలో బిజెపి 29 స్థానాలకు పోటీ చేస్తోంది. ఓ సీటును ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్ యూ)కి కేటాయించింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీ కూడా 29 స్థానాలకు పోటీ చేస్తోంది. ఓ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిని బలపరుస్తోంది.

అస్సాంలో పోలింగ్ జరుగుతున్న 47 స్థానాల్లో బిజెపి 39 స్థానాలకు పోటీ చేస్తోంది. మరో పది స్థానాలను మిత్రపక్షం అసోం గణ పరిషత్ కు కేటాయించింది. రెండు సీట్లలో ఈ రెండు పార్టీలు స్నేహపూర్వకమైన పోటీ చేస్తు్నాయి. కాంగ్రెసు 43 సీట్లకు పోటీ చేస్తోంది. మిగతా సీట్లను మహాఘట్ బంధన్ లోని పార్టీలకు కేటాయించింది. 

పశ్చిమ బెంగాల్ లో శనివారం పోలింగ్ జరుగుతున్న 30 స్థానాల్లో 2021 ఎన్నికల్లో 26 స్థానాలను తృణమూల్ కాంగ్రెసు గెలుచుకుంది. ఈసారి తృణమూల్ కాంగ్రెసు పార్టీకి బిజెపి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. 2021 ఎన్నికల ఫలితాలు పునరావృతమైతే తృణమూల్ కాంగ్రెసుకు బలం చేకూరుతుంది. 

శనివారం పోలింగ్ జరుగుతున్న జంగల్ మహల్ ప్రాంతంలో బిజెపి ఏ సందర్భంలోనూ విజయం సాధించలేదు. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు ఈ ప్రాంతంలోని 60 సీట్లలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 

2009 లోకసభ ఎన్నికల్లో జంగల్ మహల్ ప్రాంతంలో వామపక్షాలు ఆధిపత్యం చెలాయించాయి. అయితే, 2011 శాసనసభ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోియంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు 41 స్థానాలు గెలుచుకుంది. 2016లోనూ తృణమూల్ కాంగ్రెసు గెలిచింది. అయితే, ఆ పార్టీ బలం కాస్తా తగ్గింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios