ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గత మూడు నెలల నుంచి నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఏ రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబెట్టనున్నారో తెలియనుంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అధికార పార్టీగా ఉంది. ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 

గోవా (goa), మణిపూర్ (manipur), యూపీ (up), ఉత్త‌రాఖండ్ (uttarakhand), పంజాబ్ (punjab) రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల (election) ఓట్ల లెక్కింపు (counting) ప్ర‌క్రియ నేడు ప్రారంభ‌మైంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మ‌రి ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీల ప‌రిస్థితి ఏంట‌న్న విష‌యం నేడు తేలిపోనుంది. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party), బీఎస్పీ (bsp), పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) వంటి ప్రతిపక్ష పార్టీల భవితవ్యాన్ని కూడా ఈ కౌంటింగ్ నిర్ణయించనుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఏడో ద‌శ ఎన్నిక‌లు ముగిసిన రోజు సాయంత్రం అన్ని స‌ర్వేలు ఎగ్జిట్ పోల్స్ (exit polls)ను వెలువ‌రించాయి. వీటిలో యూపీలో అధికార బీజేపీ (bjp)కే అత్య‌ధిక స్థానాలు వ‌స్తాయ‌ని తెలిపాయి. అలాగే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశాయి. మ‌ణిపూర్ లో కూడా అధికార బీజేపీయే మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని తెలిపాయి. గోవాలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్ప‌డుతుంద‌ని చెప్పాయి. అలాగే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తరాఖండ్, గోవాలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని సర్వేలు అంచనా వేశాయి.

ఓట్ల లెక్కింపు సందర్భంగా వారణాసి (varanasi)లో ఈవీఎం (EVM)ల నోడల్ అధికారి (nodal officer)తో పాటు ముగ్గురు అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (central election commission) తొలగించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను అనధికార పద్ధతిలో తరలిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణపై భారీ వివాదం చెలరేగడంతో ఈసీ ఈ చర్య తీసుకుంది. ఎన్నికల సంఘం ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ (delhi chief electoral officer)ను మీరట్‌ (mirat)లో ప్రత్యేక అధికారిగా బీహార్ (bihar) సీఈఓను వారణాసిలో ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు నియమించింది.

అయితే ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు భిన్నంగా ఉండ‌టంతో అన్ని పార్టీలు త‌మ సీనియ‌ర్ నాయ‌కుల‌ను రాష్ట్రాల‌కు పంపించారు. ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం ఆయా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి, వివిధ పార్టీల నాయ‌కుల‌ను ఆక‌ర్శించడానికి వీరిని పుర‌మాయించింది. 

కాగా.. యూపీ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. 2017 ఎన్నిక‌ల‌కు ముందు స‌మాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. ఆ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారం చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన పూర్తి మెజారిటీ సాధించింది. అయితే అనూహ్యంగా ఎవ‌రూ ఊహించిన ఆ పార్టీ హైక‌మాండ్ సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. ఎంపీగా ఉన్న యోగీ ఆదిత్య‌నాథ్ కు సీఎం ప‌గ్గాలు అప్ప‌గించింది. దీంతో ఆయ‌న సీఎం బాధ్య‌త‌లు స్వీక‌రించి, అనంత‌రం శాస‌న మండ‌లికి నామినేట్ అయ్యారు. ఐదేళ్లు నిరాటంకంగా యూపీని పాలించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌లు ఆయ‌న పాల‌నకు అద్దం ప‌ట్ట‌నున్నాయి. ఐదేళ్ల ప‌రిపాల‌న ఎలా ఉందో నేడు వెలువ‌డే ఎన్నిక‌ల ఫ‌లితాలు డిసైడ్ చేయ‌నున్నాయి.