మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ మొదలైంది. ఈ కౌంటింగ్ కు సంబంధించిన అప్ డేట్ లను తమ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 

మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం మొదలైంది. ఇటీవల త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీలకు ముగిశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఫలితాలు ఎన్నికల ప్యానెల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 

'అలా చేసి ఉంటే.. షిండే ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు...', సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం నాగాలాండ్ లో ఎన్డీఏ కూటమి (బీజేపీ-ఎన్డీపీపీ) 23 స్థానాల్లో ముందంజలో ఉంది. త్రిపురలోని 60 స్థానాల్లో బీజేపీ 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. మేఘాలయలో 17 స్థానాల్లో, నాగాలాండ్ లో 21 చోట్ల ముందంజలో నిలిచింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు.