ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 3న ఫలితాలు.. కీలక తేదీలు ఇవే..
న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణతో సహా రాజస్తాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెల్లడైంది. ఈరోజు న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణతో సహా రాజస్తాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్టుగా సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. 40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించామని పేర్కొన్నారు. పార్టీలు, ప్రభుత్వాధికారులతో చర్చలు నిర్వహించామని చెప్పారు.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3 ఫలితాలు వెలువడనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశలలో పోలింగ్ జరగనుంది.
తెలంగాణ..
మొత్తం స్థానాలు-119
నోటిఫికేషన్ విడుదల-నవంబర్ 3
నామినేషన్ల స్వీకరణ- నవంబర్ 3 నుంచి 10 వరకు
నామినేషన్ల పరిశీలిన- నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ గడువు- నవంబర్ 15
పోలింగ్ తేదీ-నవంబర్ 30
కౌంటింగ్ తేదీ- డిసెంబర్ 3
మధ్యప్రదేశ్..
మొత్తం స్థానాలు-230
నోటిఫికేషన్ విడుదల- అక్టోబర్ 21
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 30 వరకు
నామినేషన్ల పరిశీలిన- అక్టోబర్ 31
నామినేషన్ల ఉపసంహరణ గడువు- నవంబర్ 2
పోలింగ్ తేదీ- నవంబర్ 17
కౌంటింగ్ తేదీ- డిసెంబర్ 3
రాజస్తాన్
మొత్తం స్థానాలు-200
నోటిఫికేషన్ విడుదల- అక్టోబర్ 30
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు
నామినేషన్ల పరిశీలిన- నవంబర్ 7
నామినేషన్ల ఉపసంహరణ గడువు- నవంబర్ 9
పోలింగ్ తేదీ- నవంబర్ 23
కౌంటింగ్ తేదీ- డిసెంబర్ 3
మిజోరం..
మొత్తం స్థానాలు-40
నోటిఫికేషన్ విడుదల- అక్టోబర్ 13
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 13 నుంచి 20 వరకు
నామినేషన్ల పరిశీలిన- అక్టోబర్ 21
నామినేషన్ల ఉపసంహరణ గడువు- అక్టోబర్ 23
పోలింగ్ తేదీ- నవంబర్ 7
కౌంటింగ్ తేదీ-డిసెంబర్ 3
చత్తీస్‌గఢ్
మొత్తం స్థానాలు-119
మొదటి దశ..
నోటిఫికేషన్ విడుదల- అక్టోబర్ 13
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 20 వరకు
నామినేషన్ల పరిశీలిన- అక్టోబర్ 21
నామినేషన్ల ఉపసంహరణ గడువు- అక్టోబర్ 23
పోలింగ్ తేదీ- నవంబర్ 7
కౌంటింగ్ తేదీ- డిసెంబర్ 3
రెండో దశ..
నోటిఫికేషన్ విడుదల- అక్టోబర్ 21
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 30 వరకు
నామినేషన్ల పరిశీలిన- అక్టోబర్ 31
నామినేషన్ల ఉపసంహరణ గడువు- నవంబర్ 2
పోలింగ్ తేదీ- నవంబర్ 17
కౌంటింగ్ తేదీ- డిసెంబర్ 3
ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికార పార్టీగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి. ఇందులో మిజోరం అసెంబ్లీ గడవు డిసెంబర్ 17న ముగియనుండగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ గడువులు జనవరిలోని వివిధ తేదీల్లో ముగియనున్నాయి.