Asianet News TeluguAsianet News Telugu

న‌వీన్ జిందాల్ కు హ‌త్యా బెదిరింపులు.. మెయిల్స్ లో ఉద‌య్ పూర్ హ‌త్య వీడియోలు...

బీజేపీ మాజీ నేత నవీన్ జిందాల్ కు మెయిల్స్ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చాయి. ఆ మెయిల్స్ లో ఉదయ్ పూర్ హత్య ఘటన వీడియో కూడా ఉంది. తన కుటుంబ సభ్యులను కూడా ఆ మెయిల్స్ బెదిరించారని నవీన్ జిందాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Assassination threats to Naveen Jindal .. Udaipur murder videos in emails ...
Author
New Delhi, First Published Jun 29, 2022, 11:33 AM IST

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక హిందూ వ‌ర్గానికి చెందిన టైలర్‌ను ముస్లిం వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు హ‌త్య చేసిన కొన్ని గంట‌ల త‌రువాత బీజేపీ బ‌హిష్కృత నేత‌న న‌వీన్ జిందాల‌కు హ‌త్యా బెదిరింపులు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని బుధ‌వారం ఉద‌యం ఆయ‌న వెల్ల‌డించారు. ‘‘ ఈ ఉదయం 6:43 గంటలకు నాకు మూడు ఇమెయిల్‌లు వచ్చాయి. అందులో సోదరుడు కన్హయ్య లాల్ గొంతు కోసిన వీడియో అటాచ్ చేసి ఉంది. అందులో వారు నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించారు. నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను ’’ అని నవీన్ జిందాల్ హిందీలో ట్వీట్ చేశాడు. 

చిన్నారిని చాకచక్యంగా కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్.. పోలీసులు సలాం కొడుతున్న నెటిజన్లు..

రాజస్థాన్ లోని ఉదయపూర్ నగరానికి చెందిన కన్హయ్య లాల్ ఇటీవ‌ల నూపుర్ శ‌ర్మ కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీనిని పోస్ట్ చేసినందుకు చేసినందుకు ఓ వ‌ర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత‌డి దుకాణంలోకి ప్ర‌వేశించి త‌ల‌న‌రికారు. ఈ  భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామ‌ని అందులో పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన నిందితులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లను అరెస్టు చేశారు. మరో వీడియోలో ఇద్దరు నిందితులు హత్యాయుధాలతో కనిపించడంతోపాటు నేరాన్ని అంగీకరించారు. ఈ వీడియోలో నిందితులు ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంపేస్తామని బెదిరించారు.

ఈ హ‌త్య‌తో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉద్రిక్తత ప‌రిస్థితి నెల‌కొంది. చెదురుమదురు హింసాత్మక ఘ‌ట‌న‌లు నెల‌కొన్నాయి. దీంతో నేడు రాష్ట్ర‌వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ ను నిలిపివేశారు. 24 గంట‌ల పాటు స‌భ‌లు, స‌మావేశాలను నిషేదించారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉంద‌ని భావిస్తున్న నిందితులు గోస్ మహ్మద్, రియాజ్‌ల ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో రాష్ట్రంలో అశాంతి వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్ర‌జ‌లు శాంతి యుతంగా ఉండాల‌ని కోరారు. ‘‘ఉదయ్‌పూర్‌లో యువకుడి దారుణ హత్యను నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో పాల్గొన్న నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటాము. దీనిపై పోలీసులు పూర్తి స్థాయి ద‌ర్యాప్తు జ‌రుపుతారు.  శాంతిని కాపాడాలని నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని గెహ్లాట్ ట్వీట్ చేశారు. 

మహా అసెంబ్లీలో బలపరీక్ష:గవర్నర్ ఆదేశాలపై సుప్రీంలో శివసేన పిటిషన్

‘‘ఇది విచారకరమైన, అవమానకరమైన సంఘటన. నేడు దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ, అమిత్ షా దేశాన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడరు? ప్రజల్లో టెన్షన్‌ నెలకొంది. ఎలాంటి హింసను సహించబోమని, శాంతి కోసం విజ్ఞప్తి చేయాలని ప్రధాని ప్రజలను ఉద్దేశించి చెప్పాలి’’ అని ఉదయపూర్ హత్యపై  స్పందిస్తూ  సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. కాగా గ‌త నెల బీజేపీ అధికార ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. దీంతో ఆమెను స‌స్పెండ్ చేశారు. అలాంటి వ్యాఖ్య‌లు చేసిన మరో నేత న‌వీన్ జిందాల్ ల‌ను కూడా పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios