అడ్రస్ అడుగుతున్నట్లు నటించి.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు.

ఓ వ్యక్తి.. పట్టపగలు.. నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు మీద వెళ్తున్న యువతిని అసభ్యంగా తాకాడు. తనపై అలా ప్రవర్తించిన వ్యక్తిని వదిలేయకుండా.. స్కూటీతో వెంబడించి మరీ ఆ కామాంధుడిని యువతి పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను.. తనకు ఎదురైన సంఘటనను యువతి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీంతో.. ఈ ఘటనపై పోలీసులు సైతం స్పందించారు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అస్సాంలోని రుక్మిణీ నగర్ కి చెందిన యువతి భావనా కష్యప్ స్కూటీ మీద వెళుతుండగా.. ఓ వ్యక్తి ఆమెను ఆపాడు. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించాడు. అతనిని స్కూటీతో వెంబడించి పట్టుకుంది. దానినంతటినీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన ఆగ్రహాన్ని తెలియజేసింది.

Scroll to load tweet…

వీడియో పోలీసులకు కంట పడటంతో.. నిందితుడిని తాజాగా అరెస్టు చేశాడు. ఈ విషయాన్ని గువాహటి పోలీసులు తమ ట్విట్టర్ లో షేర్ చేశారు.