Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్

పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో గురువారం నాడు రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
 

Assam West Bengal Election 2021 Live Updates: Second phase of voting gets underway lns
Author
New Delhi, First Published Apr 1, 2021, 9:20 AM IST

న్యూఢిల్లీ:పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో గురువారం నాడు రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

బెంగాల్ రాష్ట్రంలోని 30 అసెంబ్లీ స్థానాలకు అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.

బెంగాల్ సీఎం పోటీ చేస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి ఇవాలే పోలింగ్ జరుగుతోంది. మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఈ స్థానం నుండి సువేందు అధికారి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

టీఎంసీ అభ్యర్ధిగా సీఎం మమత బెనర్జీ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.  బెంగాల్ లోని 30 అసెంబ్లీ స్థాల్లో 171 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.సుమారు 75.94 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.

అసోం రాష్ట్రంలోని 39 అసెంబ్లీ స్థానాల పరిధిలో 345 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసోంలో మొత్తం 39 అసెంబ్లీ పరిధిలో 73.44 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios