Asianet News TeluguAsianet News Telugu

దేశంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం... 15వేల పందులు మృతి

ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది.

Assam "Prepares" For Culling As African Swine Fever Kills Nearly 15,000 Pigs
Author
Hyderabad, First Published May 15, 2020, 1:33 PM IST

ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలు లేవు. అయినా ఈ వైరస్ ని అరికట్టలేకపోయారు. దీనితోనే భయపడి చస్తుంటే.. మరో వైరస్ కలకలం రేపుతోంది.

తాజాగా దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ఫ్లూను అధికారులు గుర్తించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌గా పిలవబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది.

 దీనితో ఆక్కడి ప్రభుత్వం వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేలా పందులను సామూహికంగా చంపేందుకు సిద్ధమవుతోంది. అది కూడా కేవలం వైరస్ సోకిన వాటినే చంపాలని నిర్ణయించింది.  ఈ నేపధ్యంలోనే సుమారు పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. అటు పందుల పెంపకం చేసే రైతులకు 144 కోట్ల రూపాయల వన్ టైమ్ ఫైనాన్షియల్ ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది.

రాష్ట్రంలో పెరుగుతోన్న ఈ సంక్షోభం తీవ్ర ఆందోళనను కలగజేస్తోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 10 జిల్లాలకు వ్యాపించింది. దాదాపు 14,919 పందులు చనిపోయాయి. తాము ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దేశీయ పందులకు ప్రాణాంతకం, దాదాపు 100 శాతం మరణాల రేటు ఉంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా వ్యాపించింది. ఈ వ్యాధి జంతువుల నుండి జంతువులకే వ్యాపిస్తుందని.. మనుషులకు వ్యాప్తి చెందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాధి భారత్‌లో వ్యాపించడం తొలిసారి కాగా.. చైనా నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అస్సాం మంత్రి పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios