Batadrava Police Station: లంచం ఇవ్వలేదని పోలీసులు ఉద్దేశపూర్వకంగా దారుణం కొట్టి.. హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆగ్ర‌హించిన స్థానికులు పోలీసు స్టేష‌న్ కు నిప్పుపెట్టారు.   

Police Station Set On Fire In Assam: పోలీసుల చేతిలోనే కస్టడీలో వ్యక్తి చనిపోయాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌కు స్థానికులు నిప్పు పెట్టారు.  లంచంఇవ్వలేదని పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్న స్థానికులు పోలీసు తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మరింతగా ఆగ్ర‌హించిన స్థానికులు పోలీసు స్టేష‌న్ కు నిప్పుపెట్టారు. ఈ ఘ‌ట‌న అసోంలోని నాగోన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి మృతి చెందాడన్న ఆరోపణలతో ఆగ్రహించిన స్థానికులు  నాగోన్‌లోని బటద్రవ పోలీసు స్టేష‌న్ ను ధ్వంసం చేశారు. పోలీసుల‌పైనా దాడిచేశారు. అంత‌టితో ఆగ‌కుండా లంచం కోసం త‌మ వ్య‌క్తి ప్రాణాలు తీశార‌ని ఆరోపిస్తూ.. మ‌రింత‌గా ఆగ్ర‌హించి బటద్రవ పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. ఈ ఆరోపణలపై ప్ర‌త్యేక‌ బృందం విచారణ జరుపుతోందని పోలీసులు తెలిపారు. “పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన వ్యక్తులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు' అని ఎస్పీ లీనా డోలీ వెల్ల‌డించారు. 

బాటద్రవలోని సాల్నాబరి ప్రాంతానికి చెందిన చేపల వ్యాపారిని బాటద్రవ పోలీస్ స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అత‌ను క‌స్ట‌డీలో మ‌ర‌ణించ‌డంతో స్థానికుల‌ను ఆగ్ర‌హానికి గురిచేసింది. దీనికి తోడు అక్క‌డి పోలీసులు రూ.10 వేలు స‌హా ఒక duckను లంచం డిమాండ్ చేసినట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. లంచం కోసమే ఆ వ్యాపారిని పోలీసులు హ‌త్య చేశార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. కస్టడీలో ఉన్న చేప‌ల వ్యాపారి సఫీకుల్ ఇస్లామ్‌పై పోలీసులు దారుణంగా దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అయితే, పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడుతూ.. "ఈ వ్యక్తి (సఫీకుల్) నిందితుడు కాదు. భూమురగురి వద్ద మద్యం మత్తులో ఉన్న‌ట్టు కొందరు వ్యక్తులు అతడిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతని కుటుంబ సభ్యులు ఈ ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చి, వారు అతనికి ఆహారం తినిపించిన తర్వాత.. అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ నుండి అతన్ని నాగోన్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, అతను ఆస్పత్రిలో చనిపోయినట్టు వైద్యులు తెలిపార‌ని" పేర్కొన్నారు.  ప్రకటించబడింది.

ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు స్టేష‌న్ పై జ‌రిగిన దాడిలో ప‌లువురు పోలీసులు గాయ‌ప‌డ్డార‌నీ, వారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లు, తుపాకులు సహా స్వాధీనం చేసుకున్న వస్తువులు దగ్ధమయ్యాయ‌ని తెలిపారు. 

Scroll to load tweet…