అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కొత్తగా డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. అస్సాం ప్రభుత్వం శనివారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. జీన్స్, లెగ్గింగ్స్ నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో వెల్లడించింది.
అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను తీసుకువచ్చింది. ఈ మేరకు అసోం ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జీన్స్, టీ షర్ట్స్, లెగ్గింగ్‌లను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలల్లో టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్‌లు వంటివి ధరించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేసింది. ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శమనీ, వారు విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదకరమైన వస్త్రాధరణ ఉండాలని, అందుకే డ్రెస్ కోడ్‌ను పాటించాల్సిన అవసరం ఏర్పడిందని పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కొందరు విద్యాసంస్థల ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులను ధరించి పాఠశాలకు వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, ఇది ఆమోదయోగ్యం కాదని విద్యాశాఖ తెలిపింది. అలాగే ఉపాధ్యాయుడు సమాజానికి ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉంటూ..అన్ని రకాల మర్యాదలను పాటించాల్సి ఉంటుందనీ, ముఖ్యంగా విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మర్యాద, వృత్తి నైపుణ్యం, ఉద్దేశ్యపు గంభీరతను ప్రతిబింబించే దుస్తుల కోడ్‌ను అనుసరించడం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. పురుష, మహిళా ఉపాధ్యాయులు నిరాడంబరమైన, మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించి హుందాగా కనిపించాలని, క్యాజువల్స్, పార్టీ వేర్ దుస్తులకు దూరంగా ఉండాలని సూచించింది.
పురుష ఉపాధ్యాయులు టీషర్ట్స్, జీన్స్ కాకుండా ఫార్మల్ దుస్తుల్లో పాఠశాలలకు రావాలని, మహిళా ఉపాధ్యాయులు తమ విధులకు తగిన విధంగా చీరలు, పంజాబీ డ్రెస్లు , సల్వార్ సూట్స్ ధరించి పాఠశాలలకు వస్తే బాగుంటుందని, టీ-షర్టు, జీన్స్, లెగ్గింగ్‌లు వంటి సాధారణ వస్త్రధారణలో ఉండకూడదని విద్యాశాఖ పేర్కొంది. పైన పేర్కొన్న ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని, పాటించని వారిపై క్రమశిక్షణా చర్యను తీసుకోవచ్చని పేర్కొంది.
దీనిపై అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు స్పందిస్తూ.. అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ పుస్తకాన్ని ప్రవేశపెట్టబోతోంది, ఇది పాఠశాలను ఎలా నిర్వహించాలి. తరగతులు ఎలా నిర్వహించాలనే దాన్ని వెల్లడిస్తాయని తెలిపారు. ఈ స్కూల్ రూల్ బుక్‌లో ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా, సరిగ్గా దుస్తులు ధరించాలి. వారు ఫార్మల్ దుస్తులు ధరించాలి. విద్యార్థులకు యూనిఫాంలు ఉన్నాయి. కాబట్టి, ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులు ధరించి పాఠశాలకు రావాలి" అని డాక్టర్ రానోజ్ పేగు చెప్పారు.