Asianet News TeluguAsianet News Telugu

అస్సాం ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంది - అసదుద్దీన్ ఒవైసీ

అస్సాం ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం మదర్సాలను కూల్చివేయాలని చూస్తోందని ఆరోపించారు. 

Assam government is biased towards Muslims - Asaduddin Owaisi
Author
First Published Feb 4, 2023, 5:35 PM IST

అస్సాంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహిరస్తోందని అన్నారు. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం గత ఆరేళ్లలో పాఠశాలలను తెరవలేదని, ఇది వారి వైఫల్యమని ఆరోపించారు. కేవలం మదర్సాలను కూల్చివేయాలని మాత్రమే చూస్తోందని అన్నారు.

ఏప్రిల్ 12లోపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీని ఎవరూ ఆపలేరు - మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప

రాష్ట్ర ప్రభుత్వం మదర్సాల సంఖ్యను తగ్గించాలనుకుంటోందని అస్సాం సీఎం ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. రాష్ట్రంలోని బాలికల భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిందా అని ఒవైసీ ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాలు జరగనందున ప్రతిపక్షాలు గళం విప్పడం లేదని ఆయన అన్నారు. పార్లమెంటు నడవకపోతే బీజేపీ ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని తెలిపారు. పార్లమెంటు పనిచేయకపోతే బీజేపీని ఎండగట్టలేమని ఒవైసీ అన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు చట్టవిరుద్ధ చర్య అని సుప్రీంకోర్టు చెప్పిందని, నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ గందరగోళమైన తీర్పు ఇచ్చిందని, అయినా మోడీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లలేదని ఒవైసీ అన్నారు. ‘‘1992లో బాబ్రీ మసీదును కూల్చివేశారు. మసీదు కూల్చివేతకు డీఎం ప్రజలకు సహకరించారు. గుడి కూల్చివేతలపై అస్సాం సీఎం అబద్దాలు చెబుతున్నారు. సీఎంకు అబద్దాలు చెప్పే అలవాటు ఉంది.’’ అని ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios