Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌ సీనియర్ నేతపై అస్సాం సీఎం భార్య పరువునష్టం కేసు.. ! అసలు వివాదం ఏమిటి?

అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ భార్య కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుండి రుణ సంబంధిత రాయితీగా డబ్బు పొందిందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు. తనకు సంబంధం ఉన్న కంపెనీపై తప్పుడు ప్రచారం చేసినందుకు గాను కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌పై రూ.10 కోట్ల పరువునష్టం దావా వేస్తానని హిమంత భార్య రినికి భూయాన్‌ తెలిపారు

Assam CM Himanta Biswa Sarma Wife Will Filed Defamation Case Against Gaurav Gogoi KRJ
Author
First Published Sep 15, 2023, 3:28 AM IST

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రూ.10 కోట్ల పరువు నష్టం కేసు పెట్టనున్నారు. సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రింకీ భుయాన్ శర్మతో సంబంధం ఉన్న కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బులు అందాయని లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు. సీఎం హిమంత బిస్వా శర్మ భార్యతో సంబంధం ఉన్న కంపెనీ కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.10 కోట్లు సబ్సిడీగా పొందిందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం హిమంత బిస్వా శర్మ, కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా ట్విట్ వార్ సాగుతోంది.  

గౌరవ్ గొగోయ్ ఏమన్నారంటే? 

ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 10 కోట్లు సంబంధిత రాయితీగా పొందినట్లు సమాచారం అందించినట్లు కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

హిమంత బిస్వా శర్మ ఏం చెప్పారు?

కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ చేసిన పోస్ట్ పై సీఎం బిస్వా శర్మ స్పందించారు. గోగాయ్ ఆరోపణపై బిజెపి నేత శర్మ మాట్లాడుతూ తన భార్య కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటున్నట్లు ఆధారాలు దొరికితే ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం అన్నారు.పదవీ విరమణతో సహా ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత గోగాయ్ ఆరోపణపై బిజెపి నేత శర్మ మాట్లాడుతూ.. తన భార్య,  ఆమెతో సంబంధం ఉన్న కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో శర్మ భార్య రింకీ భుయాన్‌తో లింక్ చేయబడిన కంపెనీ పేరు వ్రాయబడిందని గొగోయ్ కు బదులిచ్చారు.

వాయిదా తీర్మానానికి కాంగ్రెస్ నోటీసు

గురువారం అస్సాం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చింది. అయితే.. ప్రశ్నోత్తరాల సమయం ముగిసే సమయానికి స్పీకర్ బిశ్వజిత్ డైమరీ ఈ అంశం వాయిదా తీర్మానానికి అర్హమైనది కాదంటూ నోటీసును తిరస్కరించారు. దీనిపై కాంగ్రెస్, సీపీఎం, స్వతంత్ర ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ వెల్‌లోకి వచ్చి రచ్చ సృష్టించారు.

కేంద్ర ప్రభుత్వంపై జైరాం రమేష్ ఫైర్ 

మరోవైపు..గురువారం నాడు కాంగ్రెస్ కమ్యూనికేషన్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రి లేదా వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? అంటూ నిలదీశారు. అదే సమయంలో అసోం ముఖ్యమంత్రి సతీమణి రినికి భుయాన్ శర్మ మాట్లాడుతూ.. తనకు సంబంధం ఉన్న కంపెనీపై తప్పుడు ప్రచారం చేసినందుకు గాను లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్‌పై రూ.10 కోట్ల పరువునష్టం కేసు వేస్తానని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios