Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ నైతికంగా అవినీతిపరుడైన నాయకుడు: హిమంత

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.  రాహుల్ గాంధీ  అవినీతిపరుడైన నైతికంగా రాజకీయ నాయకుడు అని, దోషిగా తేలిన ఎంపీ పార్లమెంటు సభ్యునిగా కొనసాగేందుకు వీలు కల్పించే బిల్లుకు సవరణను 2013లో గాంధీ వ్యతిరేకించారని గుర్తు చేశారు.

Assam CM Himanta Biswa Sarma alleged that Congress leader Rahul Gandhi is a morally corrupt politician KRJ
Author
First Published Apr 1, 2023, 1:21 AM IST

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు కూడా తోడు కట్టడంతో తీవ్రతరమవుతున్నాయి. పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ముందుకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తాజాగా మరోసారి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ  అవినీతిపరుడైన నైతికంగా రాజకీయ నాయకుడు అని, దోషిగా తేలిన ఎంపీ పార్లమెంటు సభ్యునిగా కొనసాగేందుకు వీలు కల్పించే బిల్లుకు సవరణను 2013లో గాంధీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సవరణ తీసుకురావడానికి ప్రయత్నించారని, అయితే.. రాజీవ్ గాంధీ ఆయనను బహిరంగంగా ఖండించారనీ, ఆర్డినెన్స్ కాపీని చింపివేశారని అస్సాం సీఎం అన్నారు. 

ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దోషులుగా తేలిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించరాదని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. "నైతిక ధైర్యాన్ని ప్రదర్శించడానికి బదులుగా, అతను 2013 నాటి తన స్వంత వైఖరికి విరుద్ధంగా ఖర్గే తప్పుదారి పట్టిస్తున్నారనీ, రాహుల్ గాంధీ  అవినీతిపరుడైన నైతిక రాజకీయ నాయకుడిని, ఈ దేశంలో తాను ఇలాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదని శర్మ అన్నారు.

దోషి అయిన ఎంపీ/ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలనే అంశంపై తాను దృఢంగా ఉన్నానని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారని  అస్సాం సీఎం అన్నారు. ఇటీవల సూరత్ కోర్టు పరువునష్టం కేసులో మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించబడ్డారు. ఆ తర్వాత లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios