Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సెటైర్లు


అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.

 assam chief minister himanta biswa sarma satirical comments on Rahul Gandhi lns
Author
First Published Jan 24, 2024, 9:24 PM IST | Last Updated Jan 24, 2024, 9:24 PM IST


న్యూఢిల్లీ: భారత్ జోడో న్యాయ యాత్ర అసోం రాష్ట్రంలో సాగుతుంది.  ఈ యాత్ర విషయమై  అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై రాహుల్ గాంధీ  విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో తన యాత్రను అడ్డుకొనేందుకు  హిమంత బిశ్వశర్మ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఈ ఆరోపణలను అసోం సీఎం బిశ్వ శర్మ ఖండించారు.

భారత్ న్యాయ యాత్రలో భాగంగా  ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  చేసిన ప్రసంగం వీడియోపై  అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియాలో సెటైరికల్ కామెంట్స్ చేశారు. 

 

ఉదయం లేవగానే  టీ వేడి చేయడానికి స్టవ్ లో బొగ్గు పెట్టి కాల్చాలని వ్యాఖ్యానించారు.  ఈ విషయమై  అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు.  పొయ్యి మీద బొగ్గు? బంగాళా దుంపల నుండి బంగారంగా మారుతుందనే మాటలను ఇప్పుడే సరిపెట్టుకుంటున్నామని ఆయన సెటైర్లు వేశారు. మీరు బొగ్గును పొయ్యిలో వేసి మమ్మల్ని గందరగోళానికి  గురి చేశారని  అసోం సీఎం హిమంత బిశ్వశర్మ  చెప్పారు.కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  కూడ ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  ఒక రోజు భారతదేశాన్ని నవ్వుతూ చంపేస్తాడని ఆయన సెటైర్లు వేశారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios