శివసాగర్: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శిబ్‌సాగర్ జిల్లా డీమోవ్ సమీపంలోని ఎన్ హెచ్ 37పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఓ బస్సు టెంపోను ఢీకొట్టింది. 

ఈ దుర్ఘటలో సుమారు 10 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించారు.

ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారిలో కొందరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ఈ ప్రమాదం ధాటికి బస్సు సగం వరకు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో భారీగా వర్షం కురుస్తోందని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ బస్సు డ్రైవర్ అతివేగంగా వెళ్లారని అందువల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.